సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు ఎన్నికల సమయంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆయన పై పోలీసు కేసు నమోదయ్యింది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా రకాల పోస్ట్ లు షేర్ చేశారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు ఆర్జీవీ. దాంతో ఆయన పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కానీ ఆర్జీవీ విచారణకు డుమ్మా కొట్టారు.
ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!
సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేను అని.. తనకు నాలుగు రోజుల సమయం కావాలని.. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబుకు వర్మ మెసేజ్ పెట్టారు. అలాగే తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేదుకు కోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. తన పై ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. దీని పై విచారించిన కోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. అయితే కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది.
బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్
పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరుకావాల్సిందేనని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కావాలనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ తెలిపారు దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉంది అని ఆయన అన్నారు. తాను ఎవరికి భగం కలిగేలా పోస్ట్ లు పెట్టలేదని.. అలాగే ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు చేయలేదని వర్మ స్పష్టం చేశారు. అలాగే తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందని.. అదేవిధంగా తన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది అని పిటీషన్ లో పేర్కొన్నారు వర్మ. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు ఆర్జీవీ.
మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..