బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే ముంబై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితుడి నుంచి కీలక విషయాలను రాబట్టారు.
Mumbai Police, Saif Alikhan
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన ప్రధాన నిందితుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం అతడిని థానేలో అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ దాడి ఘటనపై ముంబై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. “సైఫ్ అలీఖాన్ కేసులో అరెస్టయిన నిందితుడు బంగ్లాదేశీయుడు. అతడి పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్. అతని వయస్సు 30 సంవత్సరాలు. అతను భారతీయుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్ గా మార్చుకున్నాడు. కొన్ని నెలల క్రితమే ముంబైకి వచ్చిన అతడు ఆ తర్వాత కొద్దిరోజులు ముంబై నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు 15 రోజుల క్రితమే ముంబై తిరిగి వచ్చిన అతడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేసేందుకు చేరాడు. దొంగతనం చేయడానికే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. ఆ సమయంలో అడ్డు వచ్చిన సైఫ్ పై దాడి చేశాడు. ఈ కేసుపై నిందితుడిని కోర్టులో హజరుపరిచి.. ఆ తర్వాత పోలీసు కస్టడీకి తీసుకుంటాము. ఆ తర్వాతే తదుపరి విచారణ ప్రారంభిస్తాము” అని అన్నారు ముంబై పోలీసులు.
సైఫ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నకు సంబంధించి ప్రాథమిక విచారణ ఇంకా కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తిని 72 గంటల తర్వాత అరెస్టు చేశారు. ముంబయి పోలీసులు, క్రైం బ్రాంచ్‌కు చెందిన 30 బృందాలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.ఈ బృందంలో 100 మందికి పైగా అధికారులు ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి కోసం 15కి పైగా నగరాల్లో వెతికారు. చివరకు థానేలో నిందితుడిని అరెస్టు చేశారు.
బాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 జనవరి 16న నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి అతడిని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో సైఫ్ శరీరంలో ఆరు చోట్ల తీవ్రగాయాలు కాగా.. రెండు లోతుగా అయినట్లు డాక్టర్స్ తెలిపారు. శస్త్ర చికిత్స చేసి సైఫ్ శరీరం నుంచి రెండున్నర అంచుల కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ముంబైలోని లీలావతిఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకుంటున్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..