సినీ స్టార్స్‌ను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. ఇంకొదరైతే వారిని దేవుళ్ల మాదిరిగా కొలుస్తారు. మరికొందరు వీరాభిమానులైతే తమ అభిమాన స్టార్స్ కోసం పాదయాత్ర చేయడం, రక్తదానం చేయడం వంటివి చేస్తుంటారు. ఈ అభిమానం పీక్స్‌కి వెళ్లి వారికి గుడి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలానే ఏపీలో సమంతకు గుడి ఉంది.
Samantha Ruth Prabhu
బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన కార్ డ్రైవర్ సందీప్ సమంతకు వీర అభిమాని. ఆమెపై ఉన్న అభిమానాన్ని చూపేందుకు గత ఏడాది ఏకంగా ఆమెకు గుడి కట్టాడు. తన ఇంటి ఆవరణలోనే సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దాని ఆవిష్కరణను ఓ వేడుకలా నిర్వహించాడు. ప్రతి ఏటా నటి బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు కూడా సామ్ త్వరగా కోలుకోవాలంటూ మొక్కుబడి యాత్ర చేశాడు. సామంత కోసం తిరుపతి, చెన్నై, నాగపట్నంలో యాత్ర చేశాడు సందీప్. నటిగా మాత్రమే కాదు ఆమె చేస్తోన్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడ్నై ఈ గుడి కట్టినట్లు సందీప్ తెలిపాడు.
2010లో వచ్చిన ఏంమాయ చేశావో సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడట సందీప్. అంతే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ.. ఇతర సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడట. దీంతో అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని సందీప్ ఆలోచించి.. అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా ఆమెకు గుడి కట్టాడు. 2023లో సమంత బర్త్ డే రోజున ఈ గుడి ఆవిష్కరణ జరిగింది.
గతంలో తమిళనాట హీరోయిన్స్ ఖుష్బు, నమితలకు గుడి కట్టారు అభిమానులు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా నటికి గుడి కట్టిన తొలి వ్యక్తిగా సందీప్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.