ర్యాగింగ్ భూతానికి మరో ప్రాణం పోయింది. ఇటీవల కేరళోలని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన మిహిర్ (15) అనే బాలుడిని.. అతడి తోటి విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. తన స్నేహితుల అవమానాలు, ర్యాగింగ్ తట్టుకోలేక ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న ఈ ఘటన జరగ్గా.. తన కొడుకు ఎదుర్కోన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ సదరు విద్యార్థి తల్లి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్ట్ పెట్టింది. దీంతో ర్యాగింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ బాలుడికి ఎలాగైనా న్యాయం జరగాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాు. ఈ అమానవీయ ఘటనపై అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ సమంత సైతం స్పందించింది. అతడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసి షాకయ్యానని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
“ఇది 2025.. కానీ కొందరు వ్యక్తుల ద్వేషం, స్వార్థానికి ఓ బాలుడు ప్రాణాలను కోల్పోయాడు. హేళనగా చూడడం, ర్యాగింగ్ వంటివి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని చాలా మంది విద్యార్థులు మౌనంగా బాధపడుతున్నారు. మనం ఎక్కడ విఫలం అవుతున్నాం.. ఈ ఘటనపై సంతాపం కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాను. నిజా నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. బాధితులకు అండగా ఉండాలి” అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అలాగే ఈ ఘటనపై హీరోయిన్ కీర్తి సురేష్ సైతం స్పందించింది. బాధ్యులను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సామ్ చివరిగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో కనిపించింది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన