తిరుపతిలోని మారుతినగర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేస్తున్నారు అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా… అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూల్చివేతలు షురూ చేశారు. అయితే బిల్డింగ్‌ను కావాలనే కూలుస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు వైసీపీ శ్రేణులు. రాజకీయంగా ఎదురుకోలేక బిల్డింగ్ కూల్చేస్తున్నారంటూ నిరసనకు దిగారు.
కార్పొరేటర్ శేఖర్‌రెడ్డికి మద్దతుగా బిల్డింగ్‌లోకి వెళ్లి బైఠాయించారు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్. కూల్చివేతను అడ్డుకుని… అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్లుండి జరగనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే… వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్న శేఖర్‌రెడ్డిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని… ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చేయడమేంటని ప్రశ్నించారు…? ఎవరెన్ని కుట్రలు చేసినా డిప్యూటీ మేయర్ పీఠం వైసీపీదే అన్నారు.
ఇక ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులతో పాటు మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్‌ను అరెస్ట్ చేశారు. బిల్డింగ్ చుట్టూ మోహరించిన వైసీపీ శ్రేణులను చదరగొట్టి… కూల్చివేతలు మొదలు పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి