డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రెస్ మీట్ ను ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ – డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో మీకు తెలుసు. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థ్యాంక్స్. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో” అన్నారు.
హోస్ట్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 టైమ్ లో కూడా నన్ను హోస్ట్ గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల సీజన్ 1 చేయలేకపోయాను. ఇప్పుడు “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”లో హోస్ట్ గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఓంకార్, శేఖర్ మాస్టర్ తో కలిసి హోస్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఆ కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా. ఓంకార్ గారు చెప్పినట్లు ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తారు. “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” మీకు కంప్లీట్ ఎంటర్ టైంట్ ఇస్తుందని గ్యారెంటీగా చెప్పగలను. నేను హీరోయిన్ గా సినిమాలు చేయడాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తానో అలాగే ఇలాంటి షోస్ చేయడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను” అన్నారు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన