స్మరిస్తే పుణ్యం దర్శిస్తే జన్మ ధన్యం అని చాటుతున్నాయి సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు. వార్షికోత్సవాల్లో భాగంగా నేడు రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం ప్రధాన ఘట్టంగా నిలవనుంది. భగవద్రామానుజులపై పరమ భక్తితో శిష్యుడు సమర్పించిన 108 పాశురాలే..ఈ నూత్తందాది ! ప్రతీ కీర్తనలో భగవత్ తత్వంతో పాటు సామాజిక స్ఫూర్తి ప్రకాశిస్తుంది.
సమతా కుంభ్ -2025 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి.
బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. మన రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు పెరియ కోయల్ నంబీ రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు.
ఇవి కూడా చదవండి
సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాది రచించారు. రామానుజులవారిని ఆశ్రయించిన వారికి సంసారాన్ని జయించే అనుగ్రహము లభిస్తుందని నమ్మకం!
ఆచార్య రామానుజులపై తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ప్రబంధం అత్యద్భుతం! ఇందులో పాశురం చివరి పదం తర్వాతి పాశురం మొదటి పదం అవుతుంది.
అలాగే బుధవారం సాయంత్రం జరిగే విశేష కార్యక్రమాల్లో హనుమద్ వాహన సేవ ప్రధానమైనది. హనుమద్ వాహనంపై తరలిరానున్న 18 మంది దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు కొనసాగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..