Telugu Astrology: ఈ నెల (నవంబర్) 30 నుంచి మూడు రోజుల పాటు కుజ, చంద్రుల పరివర్తన చోటు చేసుకుంటుండగా, కొన్ని రాశుల వారికి సర్వాధికార యోగం పట్టబోతోంది. ఈ విధంగా ఏక కాలంలో రెండు పరివర్తన యోగాలు సంభవించడం జ్యోతిషపరంగా అరుదైన విషయం.
Sarwadhikara YogaImage Credit source: Getty Images
ఈ నెల (నవంబర్) 30 నుంచి మూడు రోజుల పాటు కుజ, చంద్రుల పరివర్తన చోటు చేసుకుంటుండగా, కొన్ని రాశుల వారికి సర్వాధికార యోగం పట్టబోతోంది. ఈ విధంగా ఏక కాలంలో రెండు పరివర్తన యోగాలు సంభవించడం జ్యోతిషపరంగా అరుదైన విషయం. కొన్ని రాశులవారు తప్పకుండా ఒక సంస్థకు అధిపతి కావడం, ఉన్నతాధికారి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్పు, మకర రాశులవారికి ఈ యోగం పట్టే సూచనలున్నాయి.
- మేషం: జాతక చక్రంలో మొట్టమొదటి రాశి అయిన మేష రాశిలో జన్మించిన వారికి సహజ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. నిర్భయంగా, ధైర్యంగా, నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకో వడంలో ముందు వరుసలో ఉండే ఈ రాశివారికి కుజ, చంద్రుల పరివర్తనతో పాటు గురు, శుక్రుల పరివర్తన కూడా ఒక సంస్థకు అధిపతి కావడానికి మార్గం సుగమం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 30 తర్వాత ఏడాది చివరి లోపు వీరు తప్పకుండా ఉన్నత పదవులు అందుకుంటారు.
- సింహం: ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరినైనా తేలికగా ఆకట్టుకుంటారు. వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఈ లక్షణాలకు డిసెంబర్ 30న సంభవించే రెండు పరివర్తన యోగాలు తోడై, వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. ఒక సంస్థకు అధిపతి కావడం గానీ, ఒక సంస్థను నిర్వహించడం గానీ తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఎటువంటి ఉద్యోగంలో ఉన్నా వఅత్యున్న స్థాయి పదవి లభించే అవకాశం ఉంది.
- కన్య: వ్యూహ రచనలోనూ, ప్రణాళికలు సిద్దం చేయడంలోనూ, వినూత్న పథకాలను రూపొందించడం లోనూ సిద్ధహస్తులైన కన్యారాశివారికి ఈ రెండు పరివర్తన యోగాలు కలిసి అత్యంత శుభ ఫలితా లను ఇవ్వడం జరుగుతుంది. మరో నెల రోజుల పాటు ఇతర శుభ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు తప్పకుండా ఉన్నతాధికారుల స్థాయి ఎదగడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశాలకు వెళ్లి అక్కడి కంపెనీలలో సర్వాధికార స్థానాన్ని చేపట్టే సూచనలు కూడా ఉన్నాయి.
- వృశ్చికం: ఈ రాశివారు సహజంగానే శక్తిమంతులైన నాయకులు. ఎటువంటి జటిల సమస్యనైనా పరిష్క రించగల ప్రతిభా నైపుణ్యాలు ఈ రాశివారి సొంతం. వీరు ఇతరుల మనస్సులను తేలికగా పసికట్ట గలరు. ప్రస్తుతం గ్రహచారంలో సంభవించిన రెండు పరివర్తన యోగాలు వీరికి రెట్టింపు బలంతో యోగించడం జరుగుతుంది. దీని ఫలితంగా, ఏ రంగానికి చెందినవారైనా తప్పకుండా అత్యున్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. గ్రహ బలం వల్ల వీరికి శీఘ్ర పురోగతి కూడా అవకాశ ముంది.
- ధనుస్సు: ఈ రాశివారికి సాహసాలు చేయడం మీద మక్కువ ఎక్కువ. ఎంతో ఆశాభావంతో వ్యవహరిస్తారు. సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. వీరు సరికొత్త ప్రయోగాలు చేయడం, వినూత్న నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం సంభవిస్తున్న రెండు పరివర్తన యోగాలు ఈ రాశివారికి విపరీత రాజయోగాలనివ్వడం జరుగుతోంది. ఫలితంగా సాధారణ ఉద్యోగులు సైతం ఉన్నత స్థానా లకు చేరుకునే అవకాశం ఉంది. వీరు తప్పకుండా ఉన్నత పదవులను పొందడం జరుగుతుంది.
- మకరం: క్రమశిక్షణ కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అనుకున్న పనిని సాధించడం వంటి లక్షణాలు కలిగిన ఈ రాశివారు సాధారణంగా ఏ ఉద్యోగంలోనైనా రాణించడం జరుగుతుంది. ప్రస్తుతం రెండు రకాల పరివర్తనలు చోటు చేసుకోవడంతో ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఒక సంస్థకు అధిపతి కావడం గానీ, సర్వాధికారి కావడం గానీ జరుగుతుంది. ఏదైనా వాణిజ్య సంస్థకు సలహాదారుగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది.