ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరగడం, గంటలతరబడి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం, మారిన జీవన విధానం కారణం ఏదైనా కంటి సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. కళ్లు మసకబారడం ఇటీవల ఎక్కువుతోంది. మరీ ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే కొందరిలో కళ్లు మసకబారుతుంటాయి. ఇంతకీ ఈ సమస్య రావడానికి అసలు కారణం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
* రాత్రి పడుకునే విధానం సరిగ్గా లేకపోయినా ఉదయం లేవగానే కళ్లు సరిగ్గా కనిపించవని చెబుతున్నారు. ముఖ్యంగా బోర్లా పడుకుని ముఖంపై ఒత్తిడి పడేలా పడుకుంటే కళ్లపై ప్రభావం పడి ఉదయం సరిగ్గా కనిపించవని అంటున్నారు.
* కొన్ని సందర్భాల్లో కళ్లు పొడిబారడం కారణంగా కూడా కంటి చూపు సరిగ్గా కనిపించవు. కంట్లోకి కన్నీళ్లు ఊరక పొడి బారిపోతాయి. ఈ కారణంగానే ఉదయం లేచిన తర్వాత కాసేపటి వరకు చూపు మందగించినట్లుగా ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత కాసేపు కను రెప్పలు మూసి తెరుస్తూ ఉంటూ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.
* ఉదయం నిద్రలేవగానే కళ్లు సరిగ్గా కనిపించపోవడానికి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం కూడా ఒక కారణమని అంటున్నారు. బలహీనతతో పాటు కళ్లు సరిగ్గా కనిపించకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయిచుకోవాలి.
* కంటి సంబంధిత అలర్జీలు ఉన్నా ఈ సమస్యే ఉంటుంది. కళ్లలో దురదలు పెట్టడం, వాయడం, పొడి బారడం లాంటివి అలర్జీల కారణంగా జరుగుతాయి. అలర్జీలు కూడా కంటి చూపును తగ్గడానికి కారణంగా చెప్పొచ్చు.
* పడుకునే ముందు వేసుకునే కొన్ని మందులు కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. నిద్రమాత్రలు, జలుబు, బీపీ ట్యాబ్లెట్స్ వేసుకున్న వారిలో కళ్లు పొడిబారుతాయి. ఈ కారణంగానే ఉదయం కళ్లు పొడిబారినట్లు కనిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..