పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిని నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు పొందొచ్చు. నానబెట్టిన పల్లీల్లో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. పల్లీలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి కడుపు శుభ్రపడుతుంది..
Updated on: Feb 08, 2025 | 7:06 PM
వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వేరుశనగ గింజలను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. నానబెట్టిన పల్లీల్లో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన శనగపప్పు తినడం వల్ల శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు.
1 / 5
నానబెట్టిన వేరుశనగ పల్లీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పల్లీలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి కడుపు శుభ్రపడుతుంది. నానబెట్టిన పల్లీల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా శరీరాన్ని శక్తివంతం చేస్తాయి.
2 / 5
వ్యాయామం చేసే లేదా శారీరక శ్రమ చేసే వారికి నానబెట్టిన పల్లీలు తినడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
3 / 5
నానబెట్టిన పల్లీలు డయాబెటిస్ రోగులకు మంచి ఆహారంగా పరిగణించబడతాయి. ఎందుకంటే వాటిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటుంది. నానబెట్టిన పల్లీలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.
4 / 5
కానీ నానబెట్టిన పల్లీలు తింటే కొంతమందికి అలెర్జీలు, కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి వీటిని అతిగా తినవద్దు. ఏదైనా ఆహారం పరిమితంగా తింటేనే అది అమృతంతో సమానం. కాబట్టి తినే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే, ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందువల్ల, తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
5 / 5