ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం భారీగా పెరుగుతోంది. గంటల తరబడి ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సంబంధిత సమసస్యలతో పాటు మెడనొప్పి, వెన్ను నొప్పి వేధిస్తోంది. అయితే సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో చూసే కంటెంట్ మనిషి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
నేచర్ హ్యూమన్ బిహేవియర్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగగానికి మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులు ఆన్‌లైన్‌లో ప్రతికూల కంటెంట్‌కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అధ్యయనం కనుగొంది. అధ్యయనంలో భాగంగా 1,000 మందిని పరిగణలోకి తీసుకొని ఆన్‌లైన్ బ్రౌజింగ్ అలవాట్లను పరిశీలించింది. బ్రౌజింగ్‌కు వారి మానసిక పరిస్థితికి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పేలవమైన మానసిక ఆరోగ్య లక్షణాలు ఎదుర్కొంటున్న వారు నెగిటివ్ కంటెంట్‌ను తరచుగా బ్రౌజ్ చేస్తారని పరిశోధకులు గుర్తించారు.
పబ్‌మెడ్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. సోషల్ మీడియాలో ఎక్కువ చురుకుగా ఉండటం వల్ల నిద్ర లేమి, డిప్రెషన్, మతిమరుపు వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో బిజీగా ఉండటం వల్ల సామాజిక సంబంధాలు తెగిపోయి మానసిక బంధం ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ సమస్యలు వస్తాయి. అలాగే సోషల్ మీడియాలో ఇతరులు చేస్తున్న పోస్టింగ్స్‌ను చూడడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..