Sourav Ganguly: పాంటింగ్ vs గంభీర్ కాంట్రవర్సీపై స్పందించిన దాదా.. అతనికి నా సపోర్ట్ అంటూ..

2 hours ago 1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ప్రకటనలు చేయడం ప్రారంభించారు. మాటల దాడులు చేస్తూ టీమిండియా ఆటగాళ్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి భారత జట్టు ప్రధాన కోచ్  గౌతమ్ గంభీర్‌ వారద్దరికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నాడు.  విరాట్ కోహ్లీ ఆటతీరు ఫామ్‌పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేయగా, గౌతమ్ గంభీర్‌ అతనికి ధీటుగా సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ ఫామ్‌లపై తనకు ఎలాంటి ఆందోళన లేదని గంభీర్ రికీ పాంటింగ్‌కి గట్టి కౌంటర్  ఇచ్చాడు. దీంతో రికీ పాంటింగ్‌పై పలువురు గళం ఎత్తుతున్నారు. టీమిండియా మాజీ ఆటగాళ్లు కూడా రికీని వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత జట్టు ప్రధాన కోచ్  గౌతమ్ గంభీర్‌‌కు మద్దతుకు నిలిచాడు.

రికీ పాంటింగ్ ప్రకటనను అతని సహచర ఆటగాళ్లు సమర్థించారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని పాంటింగ్ సాధించిన స్థానం ప్రకారం అతను ఏది కావాలంటే అది చెప్పగలడని కొందరు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. గంభీర్ ఎప్పుడూ పోరాడే వ్యక్తి అని గంగూలీ అన్నాడు. ఈ విషయం మార్చిపోవదన్నారు. గంభీర్ ఏమి చెప్పినా నష్టం లేదని, ఆస్ట్రేలియా పాత ముఖాన్ని గంభీర్ బయటపెట్టారన్నారు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారని వ్యాఖ్యనించారు. ఐపీఎల్ కారణంగా గత కొన్నేళ్లుగా రికీ పాంటింగ్‌ స్వరం మెత్తబడిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పారు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా టీమిండియాను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేస్తున్నారని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే..ఆ స్టార్ ఆటగాళ్లకే హై ప్రైజ్

“This was the aforesaid Gambhir you celebrated erstwhile KKR won. So what happened now? Just due to the fact that helium has mislaid 3 trial matches, helium is nary good? Give him time. You can’t justice him successful 2 months.”

– says Sourav Ganguly to RevSportzpic.twitter.com/eFp5zxxE7b

— KKR Vibe (@KnightsVibe) November 17, 2024

శ్రీలంక, న్యూజిలాండ్‌లపై ఓటమి తర్వాత గౌతం గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో గంగూలీ గంభీర్‌ను వెనకేసుకొచ్చాడు. ఓడిపోయినంత మాత్రన ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌కు సమయం ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాది గంభీర్‌కు సవాల్‌గా ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ఉంది, ఒకవేళ టీమ్ ఇండియా క్వాలిఫైయింగ్‌లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ జరగనున్నట్లు చెప్పారు. ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉందన్నారు. ఈ సిరీస్‌ల తర్వాత, అతని భవితవ్యం అతనిలో ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఆసీస్‌కి ఆ టీమిండియా ప్లేయర్ అంటే దడ..ఎలాగైనా ఔట్ చేయాలని పెద్ద స్కెచ్..

కావ్య పాప వద్దంది.. కట్ చేస్తే..ఆ ప్లేయర్ కోసం క్యూ కడుతున్న ప్రాంఛైజీలు

 మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article