స్పేస్ టెక్నాలజిలో భారత్ సాయం యూరప్ దేశాలు కోరుతున్నాయి. యూరప్ కు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో కూడా ఏర్పాట్లు చేసింది. అసలు స్టోరీ ఏంటంటే?
Isro Going To Launch Other Countries Satellites
అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్‌గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటి వరకు ఎవరికి సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇదంతా ఒక్క సారిగా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు స్వదేశ అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశ పెడుతూ ఇస్రో తన సత్తా చాటుకుంది. తాజాగా యూరప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాలను భారత్ నుంచి ప్రయోగించేందుకు ఇస్రో సహకారం కోరింది.
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం తీవ్రం.. లాక్ డౌన్ ఒక్కటే మార్గమా?
ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్ళలో ఏడాదికి ఒకటి లేదా రెండు ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే.. విజయాలే ముఖ్యమనే భావనలో ఆచి తూచి ప్రయోగాలు చేపట్టేది ఇస్రో.. గత ఐదేళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్‌ను సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళుతోంది. భారత్ స్వదేశానికి సంబంధించి అవసరమైన ఉపగ్రహాలను ప్రజలకు పంపడమే కాకుండా కమర్షియల్ ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా లాంటి దేశాలకు ఉపగ్రహాలను కూడా ఇస్రో కక్లోకి పంపగలిగేంత ఖ్యాతిగాడించింది. యూరోపియన్ దేశాలు కూడా తమ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రోని ఆశ్రయిస్తున్నారు. ప్రోబ్-3 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రోతో యూరప్ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గ్రూప్ త్రీలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసి ఒకేసారి ప్రయోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్రోకి బాగా కలిసి వచ్చిన వాహక నౌక(రాకెట్) పీఎస్ఎల్వి ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. డిసెంబర్ 4న ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 48 గంటల ముందు కౌంట్ డౌన్ మొదలు కానుంది. యూరప్‌కు చెందిన ఉపగ్రహాల ప్రయోగం తర్వాత మరో 8 దేశాలు ఇస్రో నుంచి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలని కోరగా వచ్చే రెండు నెలల్లో వాటికి సంబంధించిన ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టనుంది.