కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒకరు. కమెడియన్ గా ఎన్నో పాత్రల్లో మెప్పించారు ఈ టాలెంటడ్ నటుడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గానే కాదు హీరోగానూ సినిమాలు చేసి మెప్పించారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఓ స్టార్ హీరో సినిమాలో మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. దాంతో ఆ స్టార్ హీరోకు శ్రీనివాస్ రెడ్డి మధ్య ఎదో అయ్యిందని గుసగుసలు వినిపించాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవరు.? ఆయనకు శ్రీనివాస్ రెడ్డికి మధ్య ఏం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..
శ్రీనివాస్ రెడ్డి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఎంతో క్లోజ్ గా ఉండేవారు. కానీ ఆతర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాని గురించి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిజమే ఎన్టీఆర్ కు నాకు చిన్న గ్యాప్ వచ్చింది. మొదట్లో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. దాని తర్వాత ఆయనకు పెళ్లి అవ్వటం, నాకు పెళ్లి అవ్వటం, నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదులే అనుకోవడం కావచ్చు. ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్క క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి. ఏదైనా మన గురించి ఒకటి చెవిలో పెడితే ఎన్టీఆర్ కూడా ఆలోచిస్తారు. కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు. ఆయనకు అది లేకపోయినా ఆ చుట్టుపక్కన ఉన్నోళ్ళు నన్ను కట్ చేసి ఉండొచ్చు. మంచి రిలేషన్ ఉండేది తారక్ తో నాకు.
అప్పట్లో నేను ఆయన ఎలక్షన్ లో ప్రచారానికి వెళ్ళినప్పుడు. వాళ్ళు చేసిన ప్లాన్ అద్భుతం. ఇన్ని ఇంత ప్రచారం ఇంత గ్యాప్ లో ఆయనకి ఎంటర్ టైన్మెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ సెక్టార్ లో రాజీవ్ ఎంటర్ అవుతాడు. దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు. దాని తర్వాత రాఘవ్ ఎంటర్ అవుతాడు. రఘు ఎంటర్ అవుతాడు. అందరూ ఫ్రెండ్స్ అందరూ బాగా క్లోజ్. నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్నాను చెప్పి ఖమ్మం ఎంటర్ అయిన దగ్గరనుంచి ఎన్టీఆర్ తో నేను ఉన్నాను. ఖమ్మంలో అద్భుతమైన సెలబ్రేషన్ జరిగింది. భారీ ఎత్తున జనం వచ్చారు. మొత్తం ఆ ప్రచారంలో ఖమ్మం టాప్.
అది అయిపోయిన తర్వాత అందరం కార్లలో బయలుదేరాం. తారక్ కారులో ఎక్కాలి నేను. ఎక్కు అన్నాడు. నేను ఒక బ్యాగు తెచ్చుకున్నాను. ఆ బ్యాగు వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అని అది తెచ్చుకునే లోపు ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు. ఆ బండి బయలుదేరిపోయింది. ముందు వెళ్ళిపోయింది అది. సర్లే అని నేను వెనక కారోలో ఎక్కా.. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ బండి కింద పడి ఉంది. దిగి వెళ్తూ ఉంటే ఒక పిచ్చి అతను ఉన్నాడు. బాగా డస్టీగా.. ఒక పిచ్చి అతను. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు. మేము అటు వెళ్లి ఆ బండి లాగి చూస్తే దాంట్లో తారక్ లేడు. ఎక్కడున్నాడబ్బా అని చూస్తే.. ఆ బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టే విధంగా తారక్ ఉన్నాడు. చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నావంటే.. తలనుంచి బ్లడ్ వస్తుంది. నేను నా బ్యాగ్ లో ఉన్నటువంటి వాటిని తలకు చుట్టేసాను.ఆతర్వాత కిమ్స్ కి తీసుకొచ్చేశారు. ఆ ప్రాసెస్ లో ఒక అతను సడన్ గా కావాలని అన్నాడో లేకపోతే సెటైర్ గానో ఒక మాట అన్నాడు. నువ్వు అడుగుపెట్టావు యాక్సిడెంట్ అయింది అన్నాడు. నాకు కిందనుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి. ఏంది ఇంత మాట అనేశాడు అని నేను తిరిగి రీటర్న్ ఇచ్చాను. నేను ఉండబెట్టే ప్రాణాలతో వచ్చాడు. నేను లేకపోతే ఏమయ్యేదో అన్నాను నేను. అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందేమో లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నా చెప్పారో తెలియదు. ఆతర్వాత ఆయనకు నాకు గ్యాప్ వచ్చింది. కానీ తారక్ ను తిరిగి కలుస్తాను. నేనేంటో తారక్ కు తెలుసు అని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.