తేజ గ్రోత్ చూస్తుంటే.. చాలా మంది హీరోలకు కుళ్లు కూడా వచ్చేస్తుందేమో..? అంతగా మనోడు ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఓ బేబీ సినిమాలో చిన్న పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజ.. తాజాగా తనపైనే 50 నుంచి 100 కోట్లు ఈజీగా బడ్జెట్ పెట్టొచ్చనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నాడు. తాజాగా గోవాలో జరిగిన ‘ఇఫ్ఫి’ వేడుకల్లో తేజ సజ్జా మరోసారి తన సత్తా చూపించాడు. హనుమాన్ తర్వాత ఈయన్ని దేశవ్యాప్తంగా అందరూ గుర్తు పట్టడమే కాదు.. పాన్ ఇండియన్ సూపర్ హీరో అయిపోయాడు. చిన్న పిల్లలు అయితే హనుమాన్ అంటే తేజానే అని ఫిక్సైపోయారు కూడా. గోవాలో జరిగిన ఇఫ్పి వేడుకలలో ‘హనుమాన్’ చిత్రాన్ని ప్రదర్శించగా.. ఆడిటోరియం నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. హనుమంతు పాత్రలో తేజ నటనకు ప్రేక్షకులు అంతా మెస్మరైజ్ అయ్యారు. ఈ వేడుకల్లో ‘హనుమాన్’ స్క్రీనింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి గతంలో దక్షిణాది నటులకు IFFIలో తగిన గుర్తింపు రావడం లేదని అన్నారు. అప్పట్లో తాను గోవాకు వచ్చినపుడు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి లెజెండరీ నటుల ఫోటోలు కూడా కనిపించలేదని చాలా బాధపడ్డారు. ఎక్కడైతే చిరు ఇలా అన్నారో.. ఇప్పుడు అదే ప్రతిష్టాత్మక వేదికపై తేజ సజ్జా సత్తా చాటి తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణాలో అరుదైన ఇండియన్ వైల్డ్ డాగ్స్
మూగ జీవాలే అతని టార్గెట్.. విషం పెట్టి మరీ..
భక్తుడి బ్యాగ్‌లోని సెల్ ఫోన్ కొట్టేసిన కోతి.. పాపం ముప్పతిప్పలు పెట్టి చివరికి ??