Vande Bharat: ఏపీకి మరో వందే భారత్‌.. కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ!

2 hours ago 3

భారత రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణించే రైల్వేలో హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇక ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఈ వందేభారత్‌కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే భారత్‌లో అధునాతన సదుపాయాలు ఉన్నాయి. టెక్నాలజీతో కూడిన రైలు. ఈ రైలుకు ఇతర రైళ్లకంటే టికెట్‌ ధర ఎక్కువ ఉన్నప్పటికీ డిమాండ్‌ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది.

Had a productive gathering with Hon’ble Railway Minister Shri @AshwiniVaishnaw Ji, discussing cardinal railway issues for Visakhapatnam. Highlighted the value of retaining Waltair Division & thanked him for expediting South Coast Railway Zone construction. Requested caller rail… pic.twitter.com/QSu60CjdSE

— Bharat Mathukumilli (@sribharatm) November 27, 2024

ఈ నేపథ్యంలో ఏపీకి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ ఎంపీ, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ కోరారు. ఈ అంశంపై ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సైతం కలిశారు. విశాఖ- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ఎంపీ మంత్రిని కోరారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణంపై కృతజ్ఞతలు తెలిపారు. వాల్తేరు డివిజన్‌ను అలాగే కొనసాగించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి ఎంపీ వివరించారు. అంతేకాకుండా విశాఖ-బెంగళూరు మధ్య ప్రతి రోజు రైలు నడపాలని కోరారు. రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ శ్రీభారత్‌.. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దువ్వాడలో అలాగే చూడాలని కోరారు. ఎంపీ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article