తాగుడుకు బానిసయ్యాడు. పనీపాట లేదు. పైగా ఇంట్లో భార్యతో రోజూ గొడవలు. నాలుగురాళ్లు సంపాదించి తెస్తే.. ఏ ఆళి అయినా సంతోషంగా కుటుంబాన్ని వెళ్లదీస్తుంది. కానీ పని చేయకపోగా.. తిరిగి భార్యనే డబ్బులు అడుగుతూ ఘర్షణకు దిగేవాడు. ఇలా భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి..
Ravi
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్‌లో నివాసముంటే.. దంపతులు రవి, లక్ష్మి మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. రవి ఏదో ఒక విషయంలో డైలీ భార్యతో గొడవ పడుతుందే వాడు.. ఇటీవల ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా… రవి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి సంపత్ నగర్ లోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ భార్య భర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 13 వ తేదీన భార్య మీద కోపంతో మద్యం సేవించి ..మాయ మాటలు చెప్పి తన చిన్న కూతురు( 9)ను ఆ గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలోకి తీసుకు వెళ్ళాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి..తన కండువాతో కూతురి గొంతు బిగించి గట్టిగా ఊపిరి ఆడకుండా చేశాడు.. కూతురు సాహిత్య స్పృహ కోల్పోయి పడిపోయింది. కుమార్తె చనిపోయిందని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
కొద్ది నిమిషాలకే కూతురు..సాహిత్య స్పృహ నుంచి మేల్కొని ఉలిక్కి పడింది. ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకుని.. తన తండ్రి చేసిన ఘాతుకాన్ని తల్లి లక్ష్మికి చెప్పింది. లక్ష్మి తన భర్త రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు… చనిపోయింది అనుకున్న కూతురు నడిచి వచ్చి..జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పడంతో..తండ్రి కిరాతక చర్య బయట పడింది. లేకుంటే..కుమార్తె ప్రాణాలు గాల్లో కలిసి పోయేవి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.