నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది.. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Representative Image
G Peddeesh Kumar | Edited By: Ravi Kiran
Updated on: Feb 10, 2025 | 9:02 PM
నడిరోడ్డుపై జంతుబలిచ్చి క్షుద్రపూజలు నిర్వహించిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికులను అడలెత్తిపోయేలా చేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ క్షుద్రపూజల కలకలం స్థానికంగా తీవ్ర చర్చగా మారింది. వరుసగా క్షుద్ర పూజల సంఘటనలతో హడలెత్తిపోతున్న స్థానికులు నడిరోడ్డుపై జంతుబలి ఇవ్వడంతో వామ్మో అని వనికి పోతున్నారు. ఈ సంఘటన మల్హార్ మండలం తాడిచర్ల గ్రామంలో జరిగింది.. బీ.సీ కాలనీ సమీపంలోని మూడు బజార్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించారు.. నడిరోడ్డుపై గొర్రెను బలిచ్చి అక్కడే పూజలు నిర్వహించారు.
ఆ మార్గంలో వెళ్తున్న స్థానికులు నడిరోడ్డుపై జంతుబలి చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే గ్రామ శివారులోని మూడు బజార్ల వద్ద క్షుద్రపూజలు నిర్వహించి జంతు బలిచ్చారని ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్యకాలంలో వరుసగా క్షుద్రపూజల ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా చిత్ర పూజలు జరిపి జంతు బలిచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి