రాష్ట్రంలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల గణాంకాలపై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది. బడిలో పిల్లలకు ఉన్న టీచర్లకు పొంతన ఉందా లేదా అనే దానిపై విద్యాశాఖ అధికారుల ఆరా తీయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరంలో దాదాపు 2 వేల పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో2024-25 సంవత్సరానికి గాను 1899 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. ఈ పాఠశాలల్లో అప్పటికే 580 మంది టీచర్లు ఉన్నారు. ఎవరైనా స్టూడెంట్స్ చేరకపోతారా అని ఎదురుచూసిన విద్యాశాఖకు నిరాశ ఎదురుకాగా పిల్లలు లేని స్కూల్స్‌లో టీచర్లు ఏం చేస్తారని వారిని ఇతర స్కూల్స్‌కు ట్రాన్సఫర్ చేశారు.
తెలంగాణలో మొత్తం 26,101 పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది విద్యార్థుల బడిబాట తర్వాత ఏ స్కూల్‌లో ఎంతమంది చేరారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే లెక్కలు అధికారులు తీశారు. 1899 పాఠశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. ఇందులో 1818 ప్రాథమిక పాఠశాలలు కాగా.. 48 యూపీఎస్, 33 హైస్కూల్స్ ఉన్నాయి. పదిమందిలోపే పిల్లలున్న పాఠశాలలు 4 వేల 314 ఉన్నాయి. అందులో 3326 మంది టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఒక స్టూడెంట్ నుంచి 10 మంది వరకు ఉన్న పాఠశాలలు – 2415 , 2746 టీచర్లు పని చేస్తున్నారు.
మారుమూల గ్రామాల్లో సైతం ప్రైవేటు పాఠశాలల వైపు పేరేంట్స్ మొగ్గు చూపుతుండటంతో ఎన్ రూల్‌మెంట్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో హైస్కూల్స్‌లో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నా విద్యాప్రమాణాలపై ఎఫెక్ట్ పడకుండా ఉండటం కోసం సబ్జెక్టులకు సరిపడా టీచర్స్‌ను కొనసాగిస్తున్నారు.
వివరాలు ఇలా:
ఒక్కరే స్టూడెంట్ ఉన్న హైస్కూళ్లు – 53, పనిచేసే టీచర్లు 51
ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న హైస్కూళ్లు 142, పనిచేసే టీచర్లు 128
పది వరకూ పిల్లలున్న హై స్కూళ్లు 9, పని చేసే టీచర్లు 45
రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి పైగా స్టూడెంట్లున్న స్కూళ్లు 9,963 ఉండగా.. వాటిలో 4313 ప్రైమరీ, 1532 యూపీఎస్, 4118 ప్రైమరీ స్కూళ్లున్నాయి. వీటిలో 75,023 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రతి స్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు టీచర్లను అలాట్ చేస్తున్నారు. అయితే ప్రైమరీ స్కూళ్లే కాదు.. హైస్కూళ్లు కూడా జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉండగా, సింగిల్ డిజిట్ స్కూల్‌లు కూడా ఉండటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి