అతని పేరు షు గువాంగ్లీ. చైనాలో నివాసం ఉంటాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయంలో ఎనిమిదేళ్లు చదువుకున్నాడు. ఆఖరు సెమిస్టర్ ఒక్కటే మిగిలుంది. కేవలం ఒకే ఒక క్లాస్ మూడు నెలల పాటు అటెండ్ అయితే చాలు. మాస్టర్స్ డిగ్రీ వచ్చేస్తుంది. అందుకోసం చైనా నుంచి మెల్‌బోర్న్‌కు ప్రతి వారం విమాన ప్రయాణం చేసాడు. గతేడాది ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య మూడు నెలల సమయంలో వారానికి ఒకసారి చొప్పున 11 సార్లు ఫ్లైట్ జర్నీ చేశాడు గువాంగ్లీ. చైనా నుంచి మెల్‌బోర్న్‌కు గువాంగ్లీకి ప్రయాణానికి మూడ్రోజులు పట్టేది. అయినా ప్రయాణం చేయడానికే ఆసక్తి చూపేవాడు. చైనాలో విమానం ఎక్కితే మరునాడు ఆస్ట్రేలియా చేరుకునేవాడు. ఆ రోజు క్లాస్‌కి వెళ్లి మరుసటి రోజు ఫ్లైట్ ఎక్కి చైనా తిరిగొచ్చేవాడు. ప్రతీ వారం విమానంలో ఎందుకు వెళ్తాడు అని ఎవరైనా అతనిని అడిగినప్పుడు.. అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఇలా చేయడానికి ముఖ్య కారణం తన గర్ల్ ఫ్రెండ్ అని అతను చెప్పాడు. మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంలో ఉండగా పరిచయమైందని అనుకోకుండా తన గర్ల్‌ఫ్రెండ్ తనకంటే ముందు చైనాకు తిరిగొచ్చేసిందని అన్నాడు. ఆమె కోర్స్ పూర్తి కావడంతో ఆమె తిరిగి చైనా వచ్చేసిందని ఆమె లేకుండా మెల్‌బోర్న్‌లో ఏదో వెలితిగా అనిపించేదనీ ఒంటరితనం వెంటాడేదని గువాంగ్లీ తెలిపాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తన ప్రయాణ అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. విమాన టికెట్ కోసం, ట్యాక్సీ ఛార్జీలు భోజనం కోసం తనకు ఎంత ఖర్చు అయిందీ వివరించాడు. అలా మెల్‌బోర్న్ వెళ్లిన ప్రతీసారి డబ్బు ఆదా చేయడానికి ఫ్రెండ్ ఇంట్లో వారంలో ఒక రాత్రి బస చేసేవాడట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఉద్యోగం వెరీ స్పెషల్.. కండిషన్స్ అప్లై
బంపర్ ఆఫర్.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!
ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా
దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు