సినిమాపై ఒక్కసారిగా ఎక్కడలేని అంచనాలను పెంచేశాడు. ఈ క్రమంలోనే ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న మాళవిక యాక్షన్ సీన్ ఒకటి బయటికి వచ్చింది. అయితే ఆ సీన్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాలోనిదే అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ టాక్ ఇప్పుడు తప్పంటూ మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక మాళవిక మోహన్ రాజాసాబ్ సినిమాతో పాటు తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తోంది. అదే సర్ధార్ 2. కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సర్ధార్ 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మాళవిక రా ఏజెంట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అందుకోసమే ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగా… రౌడీలను చితక్కొడుతుంది. దీంతో నెట్టింట లీకై.. వైరల్ అవుతున్న మాళవిక యాక్షన్ వీడియో సర్ధార్ 2 షూటింగ్ నుంచి లీక్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు కొందరు నెటిజన్లు. అనడమే కాదు కోలీవుడ్ మీడియా కూడా ఇదే చెబుతోంది. దీంతో నెట్టింట వైరల్ అవుతన్న మాళవిక యాక్షన్ సీన్.. ప్రభాస్ రాజా సాబ్ సినిమాలోనిది కాదని తేలిపోయినట్టైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Donald Trump: అమెరికా అధ్యక్షుడి టేబుల్ పై స్పెషల్ బటన్.. ఏంటది? ఎందుకు?
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..
స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్ కు రివార్డ్.. ఎంత ఇచ్చారంటే..