The Raja Saab: నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంతే.. ‘ది రాజా సాబ్’లో ప్రభాస్ కొత్త లుక్ చూశారా?

2 hours ago 1

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బుధవారం (అక్టోబర్ 23) పుట్టినరోజు జరుపుకొంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ ఉత్కంఠను మరింత పెంచేలా ‘ది రాజా సాబ్’ చిత్ర బృందం కొత్త మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు బయటకు వచ్చిన పోస్టర్‌లో ప్రభాస్ రొమాంటిక్‌గా కనిపించాడు. అయితే ఇప్పుడు హారర్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు డార్లింగ్ . ఈ కొత్త గెటప్‌ని చూసి ప్రభాస్‌ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రభాస్ ఇప్పటి వరకు యాక్షన్, ఫాంటసీ, ప్రేమకథా చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు తొలిసారి హారర్ మూవీని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ హారర్ ఫీల్ కలిగిస్తోంది. ఇందులో కథ గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఈ మోషన్ పోస్టర్ పై అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ లో ప్రభాస్ న్యూ లుక్..

Rebellion and royalty didn’t conscionable come…..they’re successful his humor 🤙🏻🤙🏻

The Powerful and Majestic reign of #TheRajaSaab volition acceptable caller rules crossed the committee 🔥

Motion Poster ▶️ https://t.co/J3iUABZ4il#HappyBirthdayPrabhas ❤️

April 10, 2025 – A REBEL’s ENTERTAINMENT EXPLOSION 💥… pic.twitter.com/LWHqpViU4m

— People Media Factory (@peoplemediafcy) October 23, 2024

ది రాజా సాబ్ లో ప్రభాస్..

The communicative of #TheRajaSaab successful 2024 truthful acold ❤️🔥#Prabhas pic.twitter.com/BUD8dEKY7i

— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024

ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్.. ఇదిగో..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article