అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైనశైలిలో పాలన మొదలుపెట్టారు. ఈ క్రమంలో మిత్రులు, శత్రువులని కూడా చూడటం లేదు. తాజాగా ఆయన రష్యా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ఒప్పందం చేసుకోవాలి. సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకొంటున్నాను.
రష్యా పెద్ద చిక్కుల్లో పడనుంది’’ అని వ్యాఖ్యానించారు. రష్యా విషయంలో ట్రంప్ అసాధారణ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపర్చాయి. గతంలో పుతిన్‌ను బాగా అభిమానించిన ట్రంప్‌లో మార్పు రావడం గమనించాల్సిన అంశమే. పుతిన్‌తో భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను ఆయన్ను కలవనున్నాను. ఉక్రెయిన్‌తో సంధిని ఆయన కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను. కాకపోతే ఆయన సరిగ్గా చేయడం లేదు. అక్కడ సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. తొలుత అది.. వారం రోజుల్లోనే ముగుస్తుందనుకొన్నారు. కానీ, ఇప్పటికి మూడేళ్లయింది. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలతో రష్యా ఆర్థికవ్యవస్థ బాగా దెబ్బతింది. మరోవైపు జెలెన్‌స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులు.. ఏపీ జవాన్ మృ*తి
TOP 9 ET News: రూ.60 కోట్లు పెడితే.. ఇప్పటి వరకు రూ.175 కోట్ల రాబడి
అమెరికాలో పెట్టేబేడా సర్దుకుంటున్న.. అక్రమంగా ఉంటున్న ప్రవాసులు!