భారతదేశంలో జనాభాకు అనుగుణం ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు అధికంగా ఉంటారు. అయితే ఉద్యోగి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి, యజమాని వాటాతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా యూఏఎన్ ద్వారా పీఎఫ్ అకౌంట్‌ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆధార్ నెంబర్ ద్వారా యూఏఎన్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
Epfo
ఆధార్ ఆధారిత ఓటీపీను ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) యాక్టివేట్ చేసుకునేలా చర్యలు తీసుకోవాాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ను ఆదేశించింది. యూనియన్ బడ్జెట్ 2024-25లో ప్రకటించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్ నుంచి గరిష్ట సంఖ్యలో యజమానులు, ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చేయడం దీని లక్ష్యమని పేర్కొంది. నవంబర్ 30, 2024 నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన వారి ఉద్యోగులందరికీ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను యజమానులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
యూఏఎన్ యాక్టివేషన్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓకు సంబంధించిన సమగ్ర ఆన్‌లైన్ సేవలకు అన్‌లిమిటెడ్ యాక్సెస్‌ను అందిస్తుంది. వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పీఎఫ్ పాస్‌బుక్‌లను వీక్షించడం, డౌన్‌లోడ్ చేయడం, ఉపసంహరణలు, అడ్వాన్స్‌లు లేదా బదిలీల కోసం ఆన్‌లైన్ క్లెయిమ్‌లను సమర్పించడం, వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడం, రియల్ టైమ్ క్లెయిమ్‌లను ట్రాక్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగులకు 24/7 ఈపీఎఫ్‌ఓ సేవలను పొందడానికి యాక్సెస్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
యూఏఎన్ యాక్టివేషన్ ఇలా
- ఈపీఎఫ్ఓ మెంబర్ అధికారిక పోర్టల్‌కి వెళ్లాలి.
- “ఇంపార్టెంట్ లింక్‌లు” కింద ఉన్న “యూఏఎన్ యాక్టివేట్ చేయండి” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- యూఏఎన్ ఆధార్ నంబర్, పేరు, డీఓబీ, ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
- ఈపీఎఫ్ఓకు సంబంధించిన పూర్తి స్థాయి డిజిటల్ సేవలను యాక్సెస్ చేయడానికి ఉద్యోగులు తమ మొబైల్ నంబర్ ఆధార్-లింక్ చేసి ఉందని నిర్ధారించుకోవాలి
- అనంతరం ఆధార్ ఓటీపీ ధ్రువీకరణకు అంగీకరించాలి. మీ ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌పై ఓటీపీను స్వీకరించడానికి “గెట్ అఫిషియల్ పిన్ పొందండి”పై క్లిక్ చేయాలి.
- యాక్టివేషన్‌ను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయాలి.
- యాక్టివేషన్ అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి పాస్‌వర్డ్ పంపుతారు. అంతే మీ యూఏఎన్ యాక్టివేట్ అయిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి