అమెరికాలో జరుగుతున్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది.గత కొన్ని నెలల్లో అమెరికా అధిపతి ఎవరు అవుతారని ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా అమెరికాలోని ఓ రాష్ట్రంలో ఫలితాలు వెల్లడైయ్యాయి.
First Us Election Results
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వెల్లడైంది. అక్కడ ఆరు ఓటర్లు ఉండగా ట్రంప్‌కు మూడు, కమలా హారీస్ మూడు ఓట్లు వచ్చాయి. ఇక్కడ సోమవారం అర్ధరాత్రి నుండి ఎన్నికలు మొదలైయ్యాయి. 2022లో జరిగిన ఎన్నికల్లో జో బైడన్ వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గు చూపారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది.