భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన తదుపరి గమ్యస్థానమైన కటక్‌కు బయలుదేరే ముందు, నాగ్‌పూర్ విమానాశ్రయంలో అభిమానుల ప్రేమతో మునిగిపోయారు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఈ క్రికెట్ దిగ్గజం ఎయిర్‌పోర్ట్ చేరుకోగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని అతనికి అద్భుత వీడ్కోలు పలికారు.
ఫ్యాన్స్ ఫ్రెన్జీ – కోహ్లీ పేరుతో గగనభేరి
విమానాశ్రయం వద్ద వేచి ఉన్న అభిమానులు తమ ప్రియమైన ఆటగాడు రాగానే హర్షధ్వానాలతో ఆకాశాన్ని దద్దరిలేలా చేశారు. “కోహ్లీ… కోహ్లీ…” అంటూ నినాదాలతో విరాట్ ను తమ ప్రేమతో ముంచెత్తారు. కొన్ని క్షణాల పాటు అక్కడ ఉత్సవ వాతావరణం నెలకొంది. సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
విరాట్ కోహ్లీ భారతదేశంలోని అత్యంత ఆరాధించబడే క్రీడా వ్యక్తిత్వాలలో ఒకడు. అతని ఆటను మాత్రమే కాకుండా, అతని కమిట్మెంట్, అంకితభావం, ఫిట్‌నెస్‌ను కూడా అభిమానులు అభినందిస్తారు. ఎక్కడికి వెళ్లినా కోహ్లీ చుట్టూ అభిమానుల గుంపులు చేరడం సాధారణమైన విషయమే! కానీ నాగ్‌పూర్‌లో ఈసారి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదని చెప్పొచ్చు.
మొదటి మ్యాచ్ లో గాయం కారణంగా చోటు నోచుకోని కోహ్లీ, ఇప్పుడు కోహ్లీ తన దృష్టిని కటక్‌లో జరిగే మ్యాచ్‌పై కేంద్రీకరించనున్నాడు. ప్రస్తుతం భారత జట్టు విజయపథంలో ఉండటంతో, కోహ్లీ తన మెరుపు బ్యాటింగ్‌తో మరింత ఆకర్షణీయమైన ప్రదర్శన ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతని అద్భుతమైన ఫామ్, నిబద్ధత భారత క్రికెట్‌ను నూతన స్థాయికి తీసుకెళ్తోంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 6, 2025న నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫిల్ సాల్ట్ 43 పరుగులు, బెన్ డకెట్ 32 పరుగులతో సహకరించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను పరిమిత స్కోరులో నిలిపారు. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టు 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. శుభ్‌మన్ గిల్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 59 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
The Roar for Virat Kohli astatine Nagpur Airport erstwhile helium was leaving for Cuttack. 🔥
– THE CRAZE & AURA OF KING KOHLI..!!! 🐐 pic.twitter.com/uUUg9lYQsw
— Tanuj Singh (@ImTanujSingh) February 7, 2025