Video: కేకేఆర్ వద్దంది.. కట్‌చేస్తే.. ఒకే ఓవర్లో బీభత్సం.. 34 బంతుల్లో మ్యాచ్ ముగించిన కిర్రాక్ ప్లేయర్

5 hours ago 1

Abu Dhabi T10: అబుదాబి టీ10 లీగ్ తొలి మ్యాచ్‌లో అబుదాబి జట్టు అజ్మాన్ బోల్ట్స్‌ను ఏకపక్షంగా ఓడించింది. అజ్మాన్ బోల్ట్స్ జట్టు 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫిల్ సాల్ట్ తుఫాను బ్యాటింగ్ ఆధారంగా, అబుదాబి కేవలం 34 బంతుల్లో మ్యాచ్ గెలిచింది. అబుదాబిలో విజయంలో ఫిల్ సాల్ట్ మ్యాజిక్ పూర్తిగా కనిపించింది. సాల్ట్ 19 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 2 ఫోర్లతో బీభత్సం సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ 278.94గా నిలిచింది. ఫిల్ సాల్ట్‌తో పాటు జానీ బెయిర్‌స్టో 14 బంతుల్లో 22 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.

ఒక్క ఓవర్‌లో 5 సిక్సర్లు..

సాల్ట్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, అతను ఒకే ఓవర్‌లో 34 పరుగులు చేశాడు. టీమ్ అబుదాబిపై ఐదో ఓవర్ వేయడానికి గుల్బాదిన్ నైబ్ వచ్చాడు. ఈ క్రమంలో సాల్ట్ ఈ 6 బంతుల్లో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. గుల్బాదిన్ నైబ్ వేసిన తొలి రెండు బంతుల్లో సాల్ట్ రెండు సిక్సర్లు బాదాడు. మూడో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదిన సాల్ట్ ఓవర్‌లో 34 పరుగులు పిండుకున్నాడు.

ఇవి కూడా చదవండి

నిలుపుకోని కేకేఆర్ జట్టు..

Salt makes it spicy! 🌶️🥵

The swashbuckling English opener smacked 34 runs successful an implicit and finished with 53* (19) starring Team Abu Dhabi to a thumping triumph successful the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp

— FanCode (@FanCode) November 21, 2024

ఐపీఎల్ 2025 వేలంలో ఫిల్ సాల్ట్ కనిపించనున్నాడు. ఈ ఆటగాడికి కోట్లాది రూపాయల బిడ్ రావడం ఖాయమని తెలుస్తోంది. గత సీజన్‌లో, సాల్ట్ కోల్‌కతాలో భాగంగా ఉన్నాడు. జట్టును ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరపున సాల్ట్ 435 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 182గా నిలిచింది. సాల్ట్ తన తుఫాను ఇన్నింగ్స్ ఆధారంగా చాలా మ్యాచ్‌లను గెలుచుకున్నాడు.

అద్భుతమైన ఫాంలో సాల్ట్..

ప్రస్తుతం ఫిల్ సాల్ట్ బలమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం ఆటగాడు వెస్టిండీస్ పర్యటనలో ఆడిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీని సాధించడంలో విజయవంతమయ్యాడు. సాల్ట్ వన్డే సిరీస్‌లో కూడా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. సాల్ట్ బాగా రాణిస్తున్నాడు. దీంతో ఐపిఎల్ 2025 వేలంలో అతను భారీ మొత్తాన్ని పొందగలడని స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article