తమిళ నటుడు, టివికే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. చెన్నై శివారు పరందూరులో ఎయిర్‌పోర్టును నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. కాంచీపురం జిల్లా పరందూరు వద్ద 5వేల 335 ఎకరాల్లో రెండో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి నిర్ణయించారు. దీంతో 3 వేల ఎకరాల భూములను కోల్పోతున్నారు రైతులు.
ఏడాదిగా ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు రైతులు. వీరికి విజయ్ మద్దతు తెలిపారు. విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమ పార్టీ న్యాయపోరాటం చేపట్టడానికి వెనుకాడదని విజయ్ తెలిపారు. ఆ విషయంలో రైతులకు మద్దతు ఇస్తామని చెప్పారు. 90 శాతం వ్యవసాయ భూములు నాశనం చేసి విమానాశ్రయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నందుకు డీఎంకేది ప్రజా వ్యతిరేక పాలనగా విజయ్ అభివర్ణించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Raja Saab: ఆ లీకైన వీడియో ‘రాజా సాబ్’ది కాదు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడి టేబుల్ పై స్పెషల్ బటన్.. ఏంటది? ఎందుకు?
తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..
స్టార్‌కు సాయం చేసిన ఆటో డ్రైవర్ కు రివార్డ్.. ఎంత ఇచ్చారంటే..