మంచిర్యాల పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన నివృతి అనే పన్నెండేళ్ల చిన్నారి ఉదయం ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నివృతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అప్పటివరకూ కార్తీకపౌర్ణమి పండుగ పనుల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థితికి చేరుకుంటుందని కలలు కన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. మాయదారి గుండె పోటు 12 ఏళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకుందని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. తమ గారాల పట్టి చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిందంటూ,ఆ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టచింది. కాగా బాలిక చెన్నూర్ పట్టణంలోని స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అతి చిన్న వయసులోనే నివృతి గుండె పోటుతో మృతి చెందడంతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నివృతి మరణ వార్త విన్న పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీళ్లతో నివాళులర్పించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.