Viral News: ఒక్క అరటిపండు రూ.8 కోట్లు.. వేలంలో రికార్డు ధర.. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకే..

2 hours ago 1

అరటిపండు ధర ఎంత ఉంటుంది.. ఐదు రూపాయలు, ఆరు రూపాయలు ఎక్కువలో ఎక్కువగా 10 రూపాయలు ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరటి పండు చిత్రంలోని అరటిపండు విలువ కోట్లలో ఉంటుంది. అవును ఒక్క అరటి పండు చిత్రానికి ఇంత ధారా అని ఆలోచిస్తున్నా.. ఈ అరటిపండు ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. ఇంత ధర అయినా సరే ప్రజలు ఆ అరటి పండుని కొనడానికి ఎగబడుతున్నారు. న్యూయార్క్‌లోని గోడపై టేప్‌తో అతికించిన ఈ అరటిపండు వేలం వేయనున్నారు. దీని అంచనా ధర 1 మిలియన్ డాలర్లు (అంటే రూ. 8 కోట్లకు పైగా) ఉంచబడింది.

టేప్‌కు అంటుకున్న అరటిపండు నిజానికి ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ రూపొందించిన కళాకృతి. దీనికి అతను ‘ కమెడియన్ ‘ అని పేరు పెట్టాడు. దీనిని వ్యంగ్య శైలిలో ప్రదర్శించాడు. ఈ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఆన్‌లైన్‌లో సోత్‌బైస్ ఆక్షన్ హౌస్ వేలం వేస్తోంది. దీని బిడ్‌ నవంబర్ 20 వరకు ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

మౌరిజియో అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ‘కమెడియన్’ ఒకటని వేలం హౌస్‌కి చెందిన డేవిడ్ గల్పెరిన్ అన్నారు. దీని ప్రారంభ బిడ్ 1 మిలియన్ డాలర్ల వద్ద ఉంచబడటానికి కారణం ఇదే. మౌరిజియోకి చెందిన కొన్ని కళాఖండాలు రూ. 142 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని ఆయన చెప్పారు.

ఇదే అరటి కళ

From Velvet Underground to Duct-Tape Bananas and machine art: Discover Art’s Most Humble Icon

🍌 Just had an astonishing chat with @protourist astatine Art Basel astir the chaotic satellite of bananas successful art! 🎨🍌

From Warhol’s iconic popular creation to Cattelan’s $120K duct-taped banana, you won’t… pic.twitter.com/gWvDhCt0ps

— Eko33 (@Eko3316) June 16, 2024

మీడియా నివేదికల ప్రకారం అటువంటి మూడు అరటి కళాఖండాలు ఉన్నాయి. వాటిలో రెండు విక్రయించబడ్డాయి. ఈ కళాఖండం ప్రపంచ వాణిజ్యం, వినియోగదారుల వాదానికి ప్రతీక అని చెప్పారు. ఎవరైనా ఈ కళాకృతిని కొనుగోలు చేయాలనుకుంటే.. వేలం హౌస్ www.sothebys.com కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వేలంలో పాల్గొన వచ్చు. అయితే ఈ వేలంలో పాల్గొనడానికి నవంబర్ 20వ తేదీ వరకు అంటే రేపు వరకు మాత్రమే సమయం ఉంది.

అంతేకాదు హ్యూమనాయిడ్ రోబోట్ ఐ-డా రూపొందించిన పెయింటింగ్ కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. ఇది ఎల్లెన్ మాథిసన్ ట్యూరింగ్‌కు అంకితం చేయబడింది. అతను కంప్యూటర్ సైన్స్ పితామహుడిగా పరిగణించబడ్డాడు. ఈసారి వేలం సాంకేతికత, కళల సంగమానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ‘బనానా ఆర్ట్’, రోబోలు తయారు చేసిన పెయింటింగ్‌లు కళ ఇకపై సాంప్రదాయ పెయింటింగ్‌లు లేదా శిల్పాలకే పరిమితం కాదని చూపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article