Viral News: పిజ్జా ప్రియుల కోసం పిజ్జా హట్‌లో కొత్త వంటకం.. మార్కెట్ లోకి ఫ్రాగ్‌ పిజ్జా సందడి.. ఎక్కడంటే

2 hours ago 1

చైనా ప్రజల ఆహరపు అలవాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అనే తేడా లేకుండా.. అంటే చేపలు, మేక, కోడి వంటి వాటినే కాదు కప్పలు, కీటకాల, పాములు, కుక్క , గాడిద ఇలా అన్ని రకాల జీవులను ఆహారంగా తింటారు. అందుకే చైనా ప్రజలను పంచప్రాణ అని పిలుస్తారు. వీరు తినే విచిత్రమైన ఆహారాలతో తరచుగా వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఇదే వార్త వైరల్ అవుతోంది. చైనా మార్కెట్లోకి కప్పతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పిజ్జా ప్రవేశించింది. ఆహార ప్రియుల కోసం పిజ్జా హట్ ఈ కొత్త రకం పిజ్జాను పరిచయం చేసింది. ఈ పిజ్జా గురించి తెలిసిన తర్వాత చాలా మంది ఏమి జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

చైనాకు చెందిన పిజ్జా హట్ “గోబ్లిన్ పిజ్జా” పేరుతో కప్ప పిజ్జాను పరిచయం చేసింది. ఈ కొత్త చైనీస్ పిజ్జా వంటకం మొబైల్ గేమ్ డంజియన్స్ , ఫైటర్స్ ఆరిజిన్స్ బ్రాండ్‌ల మధ్య సహకారంలో భాగం. ఇది పిజ్జా ప్రియులను, పాప్ సంస్కృతి అభిమానులను ఒకేలా ఆకర్షించేలా లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 18న లాంచ్ అయిన గోబ్లిన్ పిజ్జా చైనాలోని మూడు పిజ్జా హట్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 169 యువాన్లు (సుమారు రూ. 2,000).

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్‌ను ఇక్కడ చూడండి:

In lawsuit yesterday’s station astir Pizza Hut, making herb vino wasn’t enough, however astir their existent promotion successful China, a pizza topped with full frog? Would you springiness this a try? Would you alternatively spot pineapple? pic.twitter.com/vS2M9p1eH2

— James Walker (@jwalkermobile) November 21, 2024

దీని గురించిన ఒక పోస్ట్‌ను జేమ్స్ వాకర్ (jwalkermobile) తన X ఖాతాలో షేర్ చేసారు. ఈ టాప్ ఫ్రాగ్ పిజ్జాను చైనాలో ప్రయత్నిస్తారా?” టైటిల్ తో షేర్ చేశారు. వైరల్ అయిన ఫోటోలో పిజ్జా బ్రెడ్ మీద వేయించిన కప్ప ఉంది. ఈ కప్పను అందంగా డెకరేషన్ కూడా చేశారు.

నవంబర్ 21న షేర్ చేసిన ఈ పోస్ట్‌ని 17,000 మంది చూశారు. రకరకాల కామెంట్‌లు వచ్చాయి. ఒకరు కావాలంటే పైనాపిల్ పిజ్జా తినవచ్చు.. దీనిని మాత్రం తినలెం అని కామెంట్ చేయగా.. దీన్ని మరొకరు “స్స్స్… ఇది చూస్తుంటే నాకు జబ్బు వస్తుంది” అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article