Viral Video: కొత్త ఆటో కోసం ఫ్రెండ్స్‌తో పందెం.. మద్యం మత్తులో వెలుగుతున్న పటాకులపై కూర్చున్న వ్యక్తి..

3 hours ago 1

బెంగుళూరులో దీపావళి పండగ రోజు రాత్రి ఓ యువకుడు తన స్నేహితులతో పటాకులు పేల్చే విషయంలో ఛాలెంజ్ చేశాడు. బెట్టింగ్ గా కొత్త ఆటో పెట్టారు స్నేహితులు. శక్తివంతమైన పటాకుల పెట్టె పై కూర్చున్న వ్యక్తి తన జీవితాన్ని మూల్యంగా చెల్లించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 32 ఏళ్ల శబరీష్ తన స్నేహితులు చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు. పటాకులు పేల్చేందుకు బయటకు వచ్చే ముందు శబరేష్ సహా స్నేహితులంతా డ్రింక్‌లు సేవించినట్లు స్థానిక సమాచారం. బాణాసంచా ఉన్న అట్టపెట్టె మీద కూర్చోవాలి. అయితే అలా పటాకుల బాక్స్ మీద కూర్చున్న తర్వాత బాణాసంచా పేలుస్తారు. ఈ పందెంలో గెలిస్తే కొత్త ఆటోరిక్షా బహుమతి అని పందెం వేసినట్లు తెలుస్తోంది.

కొత్త ఆటోరిక్షా కోసం ఆశపడ్డ శబరీష్ నడి రోడ్డు మీద ఒక పటాకుల బాక్స్ మీద కూర్చున్నట్లు ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ద్వారా తెలుస్తోంది. శబరీష్ దీర్ఘచతురస్రాకారపు పెట్టెపై కూర్చున్నాడు.. అప్పుడు అతని స్నేహితులు అతనిని చుట్టూ చేరారు. వారిలో ఒకరు పటాకులను వెలిగించారు. ఆ తర్వాత వాళ్లంతా సేఫ్టీ కోసం అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. శబరీష్ ఒక్కడే పటాకులు పేలుతాయని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొన్ని సెకన్ల నిరీక్షణ తర్వాత బాంబులు, క్రాకర్స్ వెలిగాయి. అక్కడ దట్టమైన పొగ అలముకుంది. పటాకుల పెట్టె మీద కూర్చున్న శబరీష్ చెవులు పట్టుకుని కింద పడిపోయాడు. దీంతో పోగల మధ్య ఉన్న తమ స్నేహితుడి కోసం అతని స్నేహితులు చేరుకున్నారు. అయితే అప్పటికి శబరీష్ రోడ్డుపై కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

#Bengaluru: Prank Ends successful Tragedy

A 32-year-old man, Shabarish, mislaid his beingness successful Konanakunte, South Bengaluru, aft sitting connected a container of #firecrackers that exploded beneath him. His friends had dared him, promising to bargain him an autorickshaw if helium accepted the risky challenge. pic.twitter.com/WakGZ1S66F

— Glint Insights Media (@GlintInsights) November 4, 2024

పేలుడు ధాటికి అతని అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని నివేదికలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. క్షమించరాని నేరంగా భావించిన పోలీసులు అక్కడ ఉన్న ఆరుగురు స్నేహితులపై హత్యా కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సౌత్ బెంగళూరుకి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేష్ జగలాసర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article