సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అడవి జంతువుల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తరచూ అడవి జంతువులు జనావాసాల్లోకి రావటం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయటం కూడా సోషల్ మీడియా ద్వారా మనం చూస్తుంటాం. అలాగే, అటవీ ప్రాంతాల సమీపంలోకి వెళ్లిన ప్రజలు కూడా అడవి జంతువుల బారిన పడుతుంటారు. సరిగ్గా అలాంటిదే ఈ సంఘటన. అటవీ మార్గం గుండా వెళ్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు అడవి ఏనుగుకు ఎదురు పడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించే షాకింగ్ వీడియో ఇక్కడ వైరల్ అవుతోంది.
కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెళ్లి సమీపంలోని అప్పప్పర సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. అడవి మధ్యలోంచి ఉన్న రోడ్డు వెంట బైక్‌పై వెళ్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. వాయనాడ్‌లో ఓ దంపతులు వారి చిన్నారి సహా అడవిలోంచి బైక్‌పై వెళ్తున్నారు. తిరునెల్లి దేవాలయం రోడ్డులో అడవిలోంచి అకస్మాత్తుగా ఓ భారీ ఏనుగు వచ్చింది. ఒక్కసారిగా ఎదురుపడ్డ ఏనుగును చూడగానే బైక్ నడుపుతున్న ఆ వ్యక్తి కంగుతిన్నాడు.. తనతో పాటు భార్య, బిడ్డను కూడా కాపాడుకోవాలని గట్టిగా అనుకున్నాడు..ఏ మాత్రం తడబడకుండా బైక్‌ను గట్టిగా రేజ్ చేశాడు.. ప్రాణాలను పణ్ణంగా పెట్టి వేగంగా బైకు నడుపుకుంటూ ఏనుగు బారి నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ ఏనుగు వారిని వెంబడించింది. దానికి ఏ మాత్రం చిక్కకుండా అతడు స్పీడ్‌గా బైక్‌తో పారిపోయాడు..
ఇవి కూడా చదవండి
#Kerala: In Thirunelli, Attappara, and Wayanad, bikers narrowly escaped from a chaotic elephant attack. The video of the incidental has gone viral connected societal media platforms. pic.twitter.com/cnoQMuWWfx
— South First (@TheSouthfirst) January 19, 2025
ఈ సంఘటన జనవరి 19 ఆదివారం ఉదయం జరిగింది. ఆ అడవి దారి గుండా దంపతులు బైక్ పై వెళుతున్నారు. ఆ మహిళ చేతిలో ఒక బిడ్డ ఉంది. అకస్మాత్తుగా ఏనుగు అడవి నుండి బయటకు వచ్చి జంటను వెంబడించడం ప్రారంభించింది. ప్రాణభయంతో ఆ కుటుంబం వణికిపోయింది.. ఎలాగైనా తప్పించుకోవాలనే ధైర్యంతో అతివేగంగా బైక్‌పై దూసుకెళ్లి తప్పించుకున్నారు. ఇదంతా వారి ముందు ప్రయాణిస్తున్న మరో వాహనంలో ఉన్నవారు వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేయగా అదికాస్త వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..