Viral Video: నీకేం పోయేకాలం తల్లీ..! రీల్స్ కోసం పిల్లాడి ప్రాణాలనే..! మహిళపై నెటిజన్లు ఫైర్

2 hours ago 2

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ చాలా మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. విచ్చలవిడి సోషల్‌ మీడియా వినియోగంతో ప్రజల్లో రీల్స్ పిచ్చి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతా రీల్స్‌ మానియానే కొనసాగుతోంది. ఈ పిచ్చి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లోని ప్రతి అంశంపైనా ప్రభావం చూపుతోంది. ఎంతమందికి చేరిందన్నదే లక్ష్యంగా రీల్స్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. రీల్స్ కోసం ఓ మహిళ చేసిన దుస్సాహసానికి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఏకంగా పిల్లాడి ప్రాణాన్ని ఫణంగా పెట్టింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వైరల్‌ వీడియోలో ఒక మహిళ బావి అంచున ప్రమాదకరంగా కూర్చొని ఉంది. బావిలోకి వేలాడుతున్న పిల్లవాడ్ని ఒక చేతితో పట్టుకుని రిస్కీగా రీల్‌ చేసింది. ఆమె కాలుకు ఓ చిన్న పిల్లాడ్ని వేలాడదీసి పాటకు లిప్ సింక్ ఇస్తూ రీల్స్ షుట్‌ చేస్తుంది. ఆ బాలుడు బావిలోపలి వైపుకు ఆ మహిళ కాలును పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉన్నాడు. కానీ, ఆమె మాత్రం పాటకు అనుగుణంగా డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఇస్తోంది. పసివాడిని ఒక చేతిలోంచి మరో చేతిలోకి పదే పదే మారుస్తూ..నటిస్తోంది. పాపం ఆ పసివాడు మాత్రం ప్రాణ భయంతో గిలగిలా కొట్టుకోవటం వీడియోలో కనిపిస్తుంది. పైగా, ఈ ప్రమాదకర స్టంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

Family tribunal successful custody case: Only parent tin emotion kid more. Even much than father. Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj

— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024

ఇక, నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రీల్స్ కోసం పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ మహిళపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్ల రూపంలో డిమాండ్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్న వారి వివరాలు, ఆ బాలుడికి మహిళ ఏమవుతుంది అన్న విషయాలు తెలియరాలేదు. వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article