సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి చేసిన సాహసోపేతమైన పనిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి ధైర్యంగా కాలువలో నుండి పెద్ద కొండచిలువను బయటకు తీస్తున్నాడు. ఇదంతా వీడియోలు తీసిన స్థానికులు సోష్ల మీడియాలో పోస్ట్ చేయటంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. యువకుడి ధైర్యం, నైపుణ్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.
చాలా మంది దారిలో పామును చూస్తేనే భయంతో వణికిపోతారు. ఎంత వీలైతే అంత తొందరగా దానిని నుండి దూరంగా సురక్షిత ప్రాంతానికి పారిపోయే ప్రయత్నం చేస్తారు. పాము కాటుతో ప్రాణాలు పోతాయనే భయం. అయినప్పటికీ ఇక్కడ వీడియోలో కనిపించిన యువకుడు మాత్రం..కాలువలో పడి ఉన్న ఒక పెద్ద కొండచిలువను రక్షించేందుకు తన ఒట్టి చేతులతో దాన్ని పట్టుకుని బయటకు తీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను మూడున్నర మిలియన్లకు పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి
ఈ దృశ్యం ఒక గ్రామానికి సమీపంలో ఉన్న కాలువల వద్ద కనిపించింది. అక్కడి గ్రామస్తులు కాలువలో ఈత కొడుతున్న కొండచిలువను చూశారు. అది చూసిన ఊరి జనమంతా భయపడిపోయారు. కొందరు ఆశ్చర్యపోయారు. కానీ, వారిలో ఓ యువకుడు ముందుకు వచ్చి తన చేతులతో కొండచిలువను పట్టుకుని బయటకు తీశాడు. అక్కడ నిలబడి ఉన్నవారంతా ఈ ప్రమాదకరమైన పని చేస్తున్న వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘విశాల్ స్నేక్ సేవర్’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు, ఇది ఇప్పటివరకు 36 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ వ్యక్తి ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అతన్ని ‘స్నేక్ మ్యాన్’ అని పిలుస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి