అనకాపల్లి జిల్లా ఓ గ్రామం.. ఊరంతా సందడిగా ఉంది.. గ్రామస్తులంతా బిజీబిజీగా ఉన్నారు.. గ్రామ దేవత పండుగ కావడంతో బంధుమిత్రులు భారీగా హాజరయ్యారు.. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.. ఈ సమయంలో ఒక్కసారిగా అలజడి.. పార్కింగ్ లో ఉన్న వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు రేగాయి.. అది కూడా అలాగా ఫోర్ వీలర్స్ లో ట్రైనింగ్ లో ఉన్న థార్ జీప్.. అంతా పరుగులు పెట్టారు.. చివరకు ఏమైందంటే..
ఎలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు జీపులో మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం జరిగింది. గ్రామ దేవత బండిమాంబ అమ్మవారి జాతర కావడంతో ఇతర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు గ్రామానికి తరలివచ్చారు. గ్రామ సమీపంలో వాహనాలను పార్కింగ్ చేశారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. పార్కింగ్ లో ఉంచిన థార్ జీప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటల్లో దగ్ధమవుతోన్న థార్ కారు..
క్షణాల్లో ఆ మంటలు వ్యాపించాయి. స్థానికులు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. జీపు లో వ్యాపించిన మంటలను అదుపు చేసేందుకు స్థానికులు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే మంటలు వ్యాపించి క్షణాల్లో కాలిపోయింది జీపు. ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జీపులో జరిగిన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా జరిగిందా.? ఏమైనా కుట్ర కోణం దాగిందా అన్న విధానంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..