పురావస్త శాఖ తవ్వకాలు జరుపుతుండగా.. అనేక చారిత్రక ఆనవాళ్లు.. పురాతన వైభవానికి సంబంధించిన విశేషాలు బయటపడిన సందర్భాలు ఉన్నాయి. అలానే పాత ఇళ్లు కూలుస్తుండగా.. పొలం దున్నుతుండగా నిధి.. నిక్షేపాలు బయటపడుతూ ఉంటాయి. తాజాగా అలానే...
Potato Seeds Planting(representative image)
పశ్చిమ బెంగాల్‌లోని అరుదైన ఘటన వెలుగుచూసింది. గజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్గామా గ్రామంలో కూలీలు ఓ పొలంలో బంగాళదుంపలు నాటుతుండగా.. పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూలీలు సాగు కోసం భూమిని సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా మట్టిని తవ్వుతున్నప్పుడు ఏవో మెరుస్తూ కనిపించాయ్. పరక్షించి చూడగా.. అవి ఏవో పురాతన నాణేలుగా భావించారు. వాటిని వెండి చేసినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఆశ్చర్యపోయిన కార్మికులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసు స్టేషన్ నుండి ఒక టీమ్.. ఆ పొలానికి చేరుకుని.. నాణేలను స్వాధీనం చేసుకుంది. ఆ నాణేల చారిత్రక ఆధారాలు తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు అప్పగించనుంది.
పొలంలో మొత్తం 16 వెండి నాణేలు లభించాయి. నాణేలు చారిత్రిక ప్రాముఖ్యత కలిగినవని స్థానికులు భావిస్తున్నారు. సుల్తానీ లేదా పాల్ కాలం నాటి పురాతన కాలం నాటివన్నది వారి ఆలోచన. అయినప్పటికీ నాణేల ఖచ్చితమైన మూలాలు తెలుసుకోవడానికి.. వాటి వయస్సును నిర్ధారించడానికి మరింత విశ్లేషణ అవసరం. స్థానిక అధికారులు నాణేలపై విశ్లేషణ ప్రారంభించారు. పురావస్తు శాఖ నిపుణులు నాణేలను వివరంగా పరిశీలించాలని భావిస్తున్నారు.
స్థానిక హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, పురావస్తు ఔత్సాహికుడు సర్వర్ అమన్ చౌదరి మాట్లాడుతూ నాణేలు సుల్తానీ కాలం నాటివని చెప్పారు. వాటిపై అరబిక్ శాసనాలు ఉన్నాయని.. వెండితో తయారు చేయబడినట్లు చెప్పారు. నిస్సందేహంగా అవి గొప్ప పురావస్తు విలువను కలిగి ఉన్నాయన్నారు. శిక్షణ పొందిన పురావస్తు శాస్త్రజ్ఞులచే తనిఖీ చేయంచి.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..