ఎన్నో ఏళ్లుగా ఓ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడు అనారోగ్యంతో మృతి చెందితే ఊరంతా కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన యాచకుడు తాటికొండ భాస్కర్ అనారోగ్యం తో మృతి చెందాడు. వికలాంగుడైన భాస్కర్ దశాబ్దాల కాలంగా గొల్లెన పాడు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుటుంబం, బంధువులు ఎవరూ లేకపోవడంతో.. ఆ గ్రామంలోని సచివాలయంలో, గుడిలో, ఒక్కోసారి స్థానికుల ఇళ్ల అరుగులపైన నివసిస్తూ కాలం గడుపుతున్నాడు. వికలాంగుడైన భాస్కర్ మూడు చక్రాలు బండిపై గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తూ వారు పెట్టిన అన్నంతో కడుపు నింపుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాదు అందరినీ ఎంతో ప్రేమగా స్నేహంగా పలకరిస్తూ.. భిక్షతోపాటు ఆ గ్రామస్తుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు భాస్కర్. దాంతో అతనికి ఎలాంటి కష్టం వచ్చినా గ్రామస్తులు అతనికి సహాయం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అనాధ అయిన భాస్కర్‌కి అన్నీ తామే అయి, గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. పెద్దకర్మ నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. భాస్కర్‌ను ఒక భిక్షగాడిలా కాకుండా తమ వాడిగా భావించిన గ్రామస్తుల మంచితనానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా భాస్కర్ గ్రామంలోనే మూడు చక్రాలు బండిపై తిరుగుతూ గ్రామస్తుల మన్నలలు పొందాడని కొనియాడారు. భాస్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.