అండమాన్ తీరంలో ఫిషింగ్ బోటు ఒకటి చక్కెర్లు కొడుతోంది.. అంతా చేపలు పట్టే బోట్ కదా అనుకున్నారు.. ఎందుకో కోస్ట్ గార్డ్ అధికారులకు అనుమానం వచ్చింది.. వెంటనే ఆ బోటుపై ఫోకస్ పెట్టారు.. చివరకు దాన్ని అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. కట్ చేస్తే.. బోటులో ఉన్న వాటిని చూసి దెబ్బకు షాకయ్యారు. కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఎన్నడూ పట్టుబడని డ్రగ్స్ గుర్తించడం సంచలనంగా మారింది.. ఏకంగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో డ్రగ్స్ ను తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్ట్ చేసింది. ఐసీజీకి చెందిన డోర్నియర్ విమానం పైలట్ ఈ నెల 23న బారెన్ ద్వీపంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను గుర్తించారు. దీంతో ఐసీజీ గగనతల, సముద్ర మార్గాల్లో సమన్వయంతో పని చేసి, ఈ నెల 24న ఈ పడవను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.. ఫిషింగ్ ట్రాలర్ నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 6,000 కిలోల నార్కోటిక్ డ్రగ్ మెథాంఫెటమైన్ విలువ సుమారు రూ. 36,000 కోట్లు ఉంటుందని అధికారులు మంగళవారం తెలిపారు.
In a coordinated oversea & aerial cognition @IndiaCoastGuard contiguous made past by apprehending a #Myanmarese sportfishing boat, “Soe Wai Yan Htoo,” successful the #Andaman Seas with approx 5500 kgs of Methamphetamine. This large cause haul marks the largest maritime seizure successful #India’s domain,… pic.twitter.com/YxYN5QJjCa
— Indian Coast Guard (@IndiaCoastGuard) November 25, 2024
అండమాన్ సముద్రంలోని బారెన్ ఐలాండ్ సమీపంలో ట్రాలర్‌లో దొరికిన నిషిద్ధ పదార్థాలు థాయ్‌లాండ్‌కు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు మయన్మార్ వాసులు పోలీసుల అదుపులో ఉన్నారని.. విచారణ కొనసాగుతుందని.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హరగోబిందర్ సింగ్ ధాలివాల్ చెప్పారు. మొదట బోటు వేగాన్ని తగ్గించమని కోస్ట్ గార్డ్ సిబ్బంది సూచించారు.. అయినప్పటికీ.. వారు అలాగే వేగంతో తప్పించుకోవాలని ప్రయత్నించారని.. దీంతో బోటును చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
భారతీయ జలాల్లో ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే మొదటిసారని.. సమన్వయం, అప్రమత్తతతో ఇది సాధ్యమైందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఇటీవలి కాలంలో రోహింగ్యా బోట్లు, మయన్మారీస్ వేట నౌకల ఆచూకీ ఎక్కువ కావడంతో పోలీసులు, కోస్ట్‌గార్డ్‌లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..