Viral: హైదరాబాదీ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్‌ మహీంద్ర.. చిత్రవిచ్రమైన కార్లు..

1 hour ago 1

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతీ ఒక్కరికీ ఆనంద్ మహీంద్ర గురించి తెలిసే ఉంటుంది. మహీంద్రా గ్రూప్‌ అధినేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆసక్తికర విషయాలు జరిగినా వాటిని వెంటనే సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటారు.

తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియోను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా వెరైటీ కార్లను తయారు చేస్తున్నారు. ఈ వాహనాలతో ఆయన ఓ మ్యూజియంను సైతం ఏర్పాటు చేశారు. పెన్సిల్‌, షూ, షార్ప్‌నర్‌, పిజ్జా.. ఇలా రకరకాల ఆకారాల్లో కార్లను తయారు చేసి ఏకంగా గిన్నిస్‌ రికార్డులో సైతం చోటు దక్కించుకున్నారు సుధాకర్‌.

తాజాగా ఇయనపై ఆనంద్‌ మహీంద్ర దృష్టిపడింది. ఇందులో భాగంగా ఈ మ్యూజియంకు సంబంధించి వివరాలతో కూడిన వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వెరైటీ కార్లను చూసిన దేశ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించాడు.

ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వీడియో..

If determination weren’t immoderate radical who doggedly pursued their passions—no substance however quirky—this satellite would beryllium acold little interesting..

I’m embarrassed to accidental I hadn’t heard astir the Sudha Car Museum successful Hyderabad—even though I question determination often—until I precocious saw this clip.… pic.twitter.com/c4LASs1JRV

— anand mahindra (@anandmahindra) October 26, 2024

వీడియోను షేర్‌ చేస్తూ.. ‘ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకపోతే ఈ ప్రపంచం ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వెహికల్ చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాము అని అన్నారు. నేను ఈ సారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తాను’ అని రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article