Virat Kohli’s 36th Birthday: నేడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు. అయితే, న్యూజిలాండ్‌పై ఘోర పరాజయంతోపాటు కోహ్లీ పేలవ ఫాంతో బర్త్ డే సెలబ్రేషన్స్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అయితే, విరాట్ కోహ్లీ భార్య సినీ నటి అనుష్క కూడా సైలెంట్‌గా సోషల్ మీడియాలో బాంబ్ పేల్చి, కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, బాలీవుడ్ నటి అనుష్క శర్మ భారత దిగ్గజ క్రికెటర్‌కు 36 వ పుట్టినరోజు విసెష్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఓ అద్భుతమైన పోస్ట్‌ను పంచుకుంది. కోహ్లీ ఆన్-ఫీల్డ్‌లో నిరాశకు గురైనా.. అనుష్క పోస్ట్ చేసిన ఫొటోతో విరాట్ అభిమానులకు ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో, అనుష్క తన కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌తో కోహ్లీ ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) రిటైన్ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ టాప్ 1గా నిలిచాడు. తన స్థిరమైన ప్రదర్శన తర్వాత విరాట్ ఫ్రాంచైజీ క్రికెట్ రికార్డు పుస్తకంలో తన పేరును లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో బెంగళూరు ఫ్రాంచైజీ తరపున 252 మ్యాచ్‌లలో 38.66 సగటుతో ఎనిమిది సెంచరీలు, 55 అర్ధ సెంచరీలతో 8,004 పరుగులు చేశాడు.
అతని అత్యుత్తమ స్కోరు 113*గా నిలిచింది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి కూడా ముద్దాడలేకపోయింది. 2016, 2024లో రెండుసార్లు IPL సీజన్‌లో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన విరాట్.. ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. 2016 సీజన్‌లో, అతను 16 మ్యాచ్‌లలో స్ట్రైక్ రేట్‌తో 81.08 సగటుతో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు.
కౌలాలంపూర్‌లో 2008 వరకు ఐసీసీ U19 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన యువ ఆటగాడి రోజుల నుంచి, నిలకడ, కృషి, అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్, అంకితభావానికి ప్రతిరూపంగా కోహ్లీ తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..