విటమిన్ డి ప్రధాన మూలం సూర్యకాంతి.. ఉదయాన్నే కాసేపు సూర్యకాంతిలో ఉంటే.. విటమిన్ డీ లోపం తీరుతుంది.. అంతేకాకుండా కొన్ని ఆహారాలలో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.. సాధారణంగా, డీ – విటమిన్ పాల ఉత్పత్తులు, చేపలలో పుష్కలంగా దొరుకుతుంది. మరి శాఖాహారులు పరిస్థితి ఏంటనేగా మీ అనుమానం.. వారికీ కొన్ని ఆహారాలు ఉన్నాయి. ముందుగా డీ విటమిన్ లోపం లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. విటమిన్ డి లోపం ఉన్నవారిలో కండరాల బలహీనత లేదా తిమ్మిరి, చేతులు – కాళ్లలో జలదరింపు వస్తాయి. ఎముకల నొప్పి, త్వరగా అలసిపోయినట్లు అనిపించడం,డిప్రెషన్‌గా అనిపించడం మెట్లు ఎక్కడం లేదా కింద కూర్చున్నప్పుడు లేవడంలో ఇబ్బంది పడుతుంటారు. వీరికి నడవడం కూడా కష్టంగా ఉంటుంది. డి విటమిన్ లోపం ఉన్నవారిలో వెంట్రుకల చిట్లిపోతాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని ఆహారాలు సూచిస్తున్నారు నిపుణులు. పుట్టగొడుగులు విటమిన్ డి కి అద్భుతమైన మూలం.. పుట్టగొడుగుల్లో ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే D2 సమృద్ధిగా ఉంటాయి. వాటిని సలాడ్, సూప్ లేదా కూరగాయలలో చేర్చుకుని తినవచ్చు. అలాగే పాలకూర విటమిన్ డీకి మరొక పోషకమైన ఆకు కూర. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇనుము – కాల్షియం వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. పాలకూరను సలాడ్ లేదా పకోడీలా చేసుకొని కూడా తినవచ్చు.
విటమిన్ డి పుష్కలంగా లభించే మరో ఆకుకూర కాలే. ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనిలో విటమిన్ డితో పాటు అనేక ఇతర విటమిన్లు – ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాలేను సలాడ్‌లో ఉడికించి లేదా పచ్చిగా తినవచ్చు. బ్రోకలీ లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీని ఆవిరి మీద ఉడికించి లేదా సలాడ్‌లో చేర్చి తినవచ్చు. ఆరెంజ్ విటమిన్ సికి ప్రసిద్ధి చెందింది.. సిట్రస్ జాతికి చెందిన ఈ పండులో విటమిన్ డి కూడా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ డి లభించడమే కాకుండా, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు గుడ్లు తింటే, మీకు విటమిన్ డి లోపం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. 2 గుడ్లలో సగటుగా 8.2 ఎంసిజి విటమిన్ డి ఉందని పరిశోధనలో తేలింది. ఇది విటమిన్ డి సిఫార్సు చేసిన ఆహారంలో 82 శాతం… అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.