Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. ఎక్కడ ఎందుకో తెల్సా

2 hours ago 1

సాధారణంగా పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం. మరికొందరికి ఆ పదం వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో పాములను చూస్తే.. కుప్పలు తెప్పలుగా డబ్బాల్లోనూ, బస్తాల్లోనూ కనిపిస్తే..! ఎస్.. ఇదిగో ఈ స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా కనిపిస్తున్నాయి చూశారుగా.? వారం రోజుల వ్యవధిలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ..!

అత్యంత విషపూరితమైన ఎనిమిది నాగుపాములు.. మరో 8 ర్యాట్ స్నేక్స్.. మరో మూడు పొడ పాములు..! ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా..? ఇవన్నీ విశాఖ సిటీలో పట్టుబడినవే. అవి కూడా వారం రోజుల వ్యవధిలోనే..! దీపావళి నాటి నుంచి వేర్వేరు చోట్ల జనావాసాల్లోకి వస్తూ.. హడలెత్తించిన ఈ పాములను పట్టుకుంది స్నేక్ సేవ సొసైటీ కిరణ్ అండ్ టీం. వేర్వేరు చోట్ల ఇళ్లల్ల, మరికొన్ని జనావాస ప్రాంతాల్లోకి వచ్చేసాయి ఈ సర్పాలు.

విశాఖలో స్నేక్స్ సేవర్ సొసైటీ టీం స్థానికులకు పాముల భయం నుంచి ఊరట కల్పిస్తుంది. స్నేక్ క్యాచర్ కిరణ్ నేతృత్వంలోనే ఈ బృందం.. సిటీలో కనిపించే ఏ సర్పాలైనా చాకచక్కంగా పట్టేస్తూ ఉంటారు. ఒక్క కాల్ కొడితే చాలు.. వచ్చి వాలిపోయి చాకచకంగా పామును బంధిస్తూ ఉంటారు. పట్టుకున్న వాటికి సంరక్షించి సుదూర ప్రాంతాల్లోనే పొదలు, అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. పాములకు ఏవైనా గాయాలైన.. వాటిని పశు వైద్యుల వద్దకు తీసుకెళ్లి సపర్యలు కూడా చేస్తారు. ఆరోగ్యకరంగా ఉన్న పాములను అటవీ శాఖ సూచనల మేరకు.. శివారులోని పొదల్లో పట్టుకున్న పాములను సేఫ్‌గా విడిచిపెడుతున్నారు.

ఈ మధ్యకాలంలో.. స్నేక్స్ సేవర్ సొసైటీ సభ్యులు భారీగానే పాములు పట్టుకున్నారు. కేవలం వారం వ్యవధిలోనే.. జెర్రి గుడ్లు, నాగుపాములు, పొడ పాములను క్యాచ్ చేశారు. జనావాసాల మధ్యకు వచ్చి గుబులు పుట్టిస్తున్న పాములన్నిటిని పట్టుకొని బంధించారు. కట్టలు కట్టలుగా ఒకచోట చేర్చి వాటిని విడిచి పెడుతున్నారు. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరిపించుకుంటున్నారు విశాఖ జనం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article