దేశంలో రోడ్ల పరిశుభ్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనిపిస్తుంది ఎవరికైనా.. రోడ్డుమీదనే కాదు ఎక్కడ బడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసే అలవాటుని పోగొట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసింది. రోడ్లపై ఉమ్మి వేస్తే కలిగే సమస్యల గురించి అవగాన కల్పించడమే కాదు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, పొగాకు ఉత్పత్తులను నమిలి ఉమ్మినా కేసు నమోదు చేస్తామని ప్రకటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడంతో దేశంలోనే గుజరాత్ ముఖ్య పట్టణం సూరత్ మున్సిపాలిటీ ముందడుగు వేసింది.
Spitting In Public Places
రోడ్డు మీద వెళ్తుంటే మనం వెళ్లే పనులు, హడావుడి తప్ప వేరేవి పెద్దగా పట్టించుకోరు కొందరు. ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్యే ఉమ్మివేస్తారు. పక్కన ఎవరైనా వెళ్తున్నారా? వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడతారా అనే కనీస విచక్షణ జ్ఞానం కూడా ఉండదు చాలా మందికి. అలాంటి వారినే ఇప్పుడు టార్గెట్ చేసింది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్. ఇకపై రోడ్ల మీద ఇష్టారీతిన ఉమ్మివేసే వాళ్ల ఆట కట్టించడానికి జరిమానాలు విధించనుంది.
దేశంలోనే తొలిసారిగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో రోడ్లపై ఉమ్మివేసే వారిపై చర్యలకు పూనుకుంటుంది. ఇందుకు గాను సూరత్ మున్సిపాలిటీ కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 4500 కెమెరాల ద్వారా 24X7 పర్యవేక్షణ చేపడుతోంది. తద్వారా రోడ్లపై ఉమ్మివేసే వ్యక్తులను గుర్తించి పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.9 లక్షల వరకు జరిమానాలు విధించారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం దృష్ట్యా సూరత్ మున్సిపాలిటీ ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది.
సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కట్టుదిట్టం చేయడమే కాదు.. భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది సూరత్ మున్సిపాలిటీ. రానున్న రోజుల్లో పరిస్థితుల్లో మార్పులు బట్టి మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఈ క్రమంలోనే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు కూడా ఆరోగ్య శాఖ సన్నాహాలు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..