Watch: 104 మందితో టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు.. అందరూ చూస్తుండగా క్షణాల్లో…

3 hours ago 1

అమెరికాలో ఆదివారం నాడు ఓ పెద్ద విమానం ప్రమాదం నుంచి బయటపడింది. విమానం టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా దాని రెక్కల్లో మంటలు చెలరేగాయి. ఇలాంటి షాకింగ్‌ సంఘటనా జార్జిబుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 2 ఆదివారం రోజున హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలో మంటలు కనిపించిన వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి ప్రయాణికులను విమానం నుంచి బయటకు దింపేశారు. విమానం ఎమర్జెన్సీ డోర్స్‌ ఓపెన్‌ చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని హ్యూస్టన్ ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది.

నివేదిక ప్రకారం, ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వెంటనే ఎయిర్ పోర్టులోని అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పివేశాయి. మంటల్లో చిక్కుకున్న విమానం ఎయిర్‌బస్‌కు చెందిన ఏ-319. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

🚨#BREAKING: Numerous passengers were evacuated aft United Airlines level aft it caught occurrence during takeoff

📌#Houston | #Texas

A United Airlines formation from Houston to New York was evacuated aft an motor occurrence forced the unit to abort takeoff, according to the FAA.… pic.twitter.com/bfoYcALkjW

— R A W S A L E R T S (@rawsalerts) February 2, 2025

ఇదిలా ఉంటే, శుక్రవారం తెల్లవారుజామున ఫిలడెల్ఫియాలోని మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో విమానం కూలిపోవడంతో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. అది ఒక ‘ఎయిర్ అంబులెన్స్’, అందులో ఒక అమ్మాయి, ఆమె తల్లి, మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరంతా మెక్సికో వాసులుగా గుర్తించారు.

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article