క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులకు పేరుగాంచింది. బట్టల నుండి ఫ్యాషన్ వరకు, ఉపకరణాల నుండి బాడీ స్ప్రేల వరకు ఈ బ్రాండ్ పేరు అంతటా విస్తరించింది. తల్లికోసం యదుప్రియన్ మెహతా కొనుగోలు చేసిన ఖరీదైన గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే యూజర్లలో చర్చనీయాంశంగా మారింది. ఓ కొడుకు తన తల్లిపై చూపిన ప్రేమ చాలా మంది హృదయాలను కదిలించింది.
Expensive Gift For Mother
మనందరి ఆది దైవం అమ్మ.. తొలి గురువు కూడా అమ్మే. తల్లీ బిడ్డల మధ్య ఉండే ప్రేమ అమోఘం. పిల్లలు ఎంత పెద్దవారైనా, తల్లులు వారిని చంటి పిల్లలుగానే భావిస్తారు. చాలా మంది పిల్లలు కూడా తమ తల్లికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కొందరు పిల్లలు తమ తల్లి సకల సుఖాలు, విలాసాలు అనుభవించాలని కోరుకుంటారు. అలాగే, ఓ కొడుకు తన తల్లి కోసం ఖరీదైన గిఫ్ట్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. అతడు తన తల్లి కోసం లగ్జరీ బ్రాండ్ స్లిప్పర్స్ కొన్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వాటి ధర తెలిస్తే ఖచ్చితంగా కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
కంటెంట్ క్రియేటర్ యదుప్రియన్ మెహతా తన తల్లి కోసం న్యూయార్క్‌లో ఖరీదైన చెప్పులు కొన్నాడు. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌కు చెందిన ఈ చెప్పుల ధర దాదాపు రూ.86 వేలు అంటూ అతడు వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఉత్పత్తులకు పేరుగాంచింది. బట్టల నుండి ఫ్యాషన్ వరకు, ఉపకరణాల నుండి బాడీ స్ప్రేల వరకు ఈ బ్రాండ్ పేరు అంతటా విస్తరించింది. తల్లికోసం యదుప్రియన్ మెహతా కొనుగోలు చేసిన క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ చెప్పులకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే యూజర్లలో చర్చనీయాంశంగా మారింది. ఓ కొడుకు తన తల్లిపై చూపిన ప్రేమ చాలా మంది హృదయాలను కదిలించింది. తల్లి కోసం కొడుకు కొనుగోలు చేసిన ఈ లగ్జరీ చెప్పులపై చాలా మంది వీడియోలో వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..