కొన్ని దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున ఖాన్‌దేవునికి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఖాన్‌దేవునికి నైవేద్యం పెట్టేందుకు నెలరోజుల ముందు నుంచే ఆదివాసీలు ఇంట్లోనే నువ్వులనూనె తయారుచేస్తారు. అలా తయారు చేసిన నూనెను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి తరలివస్తారు తొడసం వంశస్తులు. మహరాష్ట్ర కోద్దిపూర్ గ్రామనికి చెందిన తొడసం వంశస్తుల ఆడపడుచు మెస్రం నాగుబాయి రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఇలా మొక్కడం వలన సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. వందేళ్లుగా ఈ ఆచారం వస్తుందని, తొడసం ఆడపడుచులు మూడేళ్లకోసారి ఒకరు నువ్వుల నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ కమిటీ వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్! కోక్ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..