తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు గుడ్‌న్యూస్. ఇకపై బీర్లు ఏరులై పారాల్సిందే. కింగ్ ఫిషర్ బీర్ల కోసం బెంగపెట్టుకున్న వారికి ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. దీనిపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరా యధాతథంగా కొనసాగిస్తున్నట్లు BSEకి లేఖ రాసింది. బీర్ల సప్లై నిలిపిస్తున్నట్టు జనవరి 8న UBL ప్రకటించింది. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపింది. ధరల పెరుగుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్య నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందంటూ లేఖ పేర్కొంది.
ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారిస్తామని హామీ రావడంతో బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగిస్తామంది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది. కింగ్ ఫిషర్, హెనికేన్ సహా పలు టాప్ బ్రాండ్లను తెలంగాణ బేవరీస్‌కి సప్లై చేస్తోంది UBL. తెలంగాణకి మద్యం సరఫరా చేస్తున్న 6 కంపెనీల్లో 70 శాతం UBL నుంచి సప్లై అవుతుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి