సాధారణంగా పాములు.. తోటలు, అటవీ ప్రాంతాల్లో చీమలు ఏర్పరచిన పుట్టల్లో నివసిస్తూ ఉంటాయి. కానీ ఓ నాగుపాము ఏకంగా ఓ ఇంట్లోని పెద్ద పుట్టలో నివసిస్తూ స్థానికులతో పూజలందుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో జనావాసాల మధ్య ఉంటోంది ఓ సర్పం. ఓ ఇంటిలో ఏర్పడిన పుట్టలో చేరింది. మొదట్లో ఆ పుట్టను తొలగించాలని ఆ ఇంటివారు, స్థానికులు ప్రయత్నించినా వారివల్ల కాలేదట. దాంతో ఇక ఆ పుట్టను కదల్చకుండా నాగదేవతే తమ ఇంట కొలువైందంటూ పూజలు చేస్తున్నారు.
ఈ పుట్టకు మూడు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ పుట్ట ఉన్న ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట ఓ చిన్న పుట్ట ఏర్పడిందట. ఇంట్లో పుట్టలు ఉండటం మంచిదికాదని ఆయన తల్లి రెండు మూడుసార్లు తొలగించారట. అయితే ఆ సందర్భంలో రామారావు తల్లి అనారోగ్యం పాలవ్వడం, కుటుంబ సభ్యులు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందట. ఎన్నిసార్లు తొలగించినా పుట్ట మళ్లీ మళ్లీ ఏర్పడడంతో.. ఈ విషయంపై పండితులను సంప్రదించగా.. వారు మళ్ళీ ఈసారి ఇంట్లో పుట్ట వెలిస్తే దానిని తొలగించవద్దని అది దేవుని అనుగ్రహం అని తెలిపారట. దాంతో తరువాత మళ్ళీ పుట్ట ఏర్పడగా దానిని తొలగించే యత్నం చేయకుండా పూజలు చేయడం మొదలుపెట్టారట. ఈ పుట్టలోకి తరచూ నాగుపాము వచ్చిపోతుండేదట. అయినా ఆ పాము వారికి ఎలాంటి హానీ చేయలేదని తెలిపారు. అంతేకాదు, ఆ పాము తమ ఇంట్లో సంచరిస్తున్నప్పటినుంచి కుటుంబంలోని వారంతా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఆర్ధికంగానూ ఎదిగామని తెలిపారు. ఇక పుట్ట ఉన్న ఆ ఇంటిని నాగదేవతకు ఆలయంగా వదిలేసి, పక్కనే మరో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారట. ముప్పై ఏళ్లు పైబడినా ఇప్పటికీ పాము పుట్టలోకి వచ్చి పోతూ ఉంటుందనీ అప్పుడప్పుడు పామును తాము చూస్తూ ఉంటామని ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టదని స్థానికులు చెబుతున్నారు. సంతానం లేనివారు పూజ చేసి చక్కని పిల్లల్ని పొందారని అంటున్నారు స్థానికులు. ఈ పుట్ట ప్రతిఏటా పెరుగుతూ ఉందని, దీనిపై దేవతా మూర్తుల స్వరూపాలు శిల్పులు చెక్కినట్లుగా దర్శనమివ్వటం ఇక్కడ మరో విశేషం. పుట్టను తదేకంగా పరిశీలిస్తే శివ లింగం, వినాయకుడు, లక్ష్మి నరసింహ స్వామి, లక్ష్మి దేవి స్వరూపాలు కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు. ఈ పుట్టను దర్శించుకునేందుకు దూరప్రాంతాలనుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.