రోజుకొక్క యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారనేది పాత సామెత. కానీ నేటి కాలంలో యాపిల్ ఒక్కటే సరిపోదు. దానితోపాటు ఇతర ఆహారాలు కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, ఆపిల్ వంటి అనేక ఆహారాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని సూపర్ ఫుడ్స్ అని అంటారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా సులభంగా నివారించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
అవోకాడో
బటర్ ఫ్రూట్ లేదా అవకాడో కాస్త ఖరీదైనదే అయినా ఆరోగ్యానికి ఇలా చాలా మంచిది. అన్ని ఇతర పండ్ల కంటే, అవకాడోస్ తీసుకోవడం వల్ల అనారోగ్యం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో ఇది బలేగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు దీనిని రోజుకొక్కటైనా తినాలంటున్నారు నిపుణులు. అవకాడోలో జింక్, ఫాస్పరస్, కాపర్, కాల్షియం, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఖనిజ సాంద్రతను పెంచడంలో ఉపయోగపడతాయి.
క్యారెట్
ఇది మన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ముఖ్యమైన వెటిటబుల్. క్యారెట్‌లో మన శరీరానికి అవసరమైన అద్భుతమైన ఆరోగ్య గుణాలు ఉన్నాయి. ఇందులో చాలా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. క్యాన్సర్ కణాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ సమస్యను దూరం చేస్తుంది. చిగుళ్ళు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో క్యారెట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దంతక్షయం నుంచి దంతాలను రక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి
కొబ్బరి
కొబ్బరిని దక్షిణ భారత వంటకాలలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. కొబ్బరిలో గరిష్ట మొత్తంలో పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో సి, ఇ, బి, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, ఐరన్, సెలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. రాత్రిపూట కొబ్బరిని తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే పడుకునే ముందు పచ్చి కొబ్బరి తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని కొవ్వు శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది.
దానిమ్మ
దానిమ్మ.. ఆరోగ్యకరమైన పండ్లలో ఇది కూడా ఒకటి. దీనిలోని పోషకాలను బట్టి కొందరు దీనిని భగవంతుని ఫలం అని కూడా అంటారు. సాధారణ రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి సీజనల్ వ్యాధుల నివారణ వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. దానిమ్మ పండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండ్ల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. అలాగే, దానిమ్మ రసం తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.